
📌 Key Points
- బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ధర రూ. 1,34,166.
- మొబైల్ నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్ట్ అవ్వొచ్చు.
- అత్యవసర సేవలు, రక్షణ రంగం, విపత్తు సమయాల్లో ఉపయోగం.
- కఠిన వాతావరణాన్ని తట్టుకునే డిజైన్, SOS ఎమర్జెన్సీ ఫీచర్.
బీఎస్ఎన్ఎల్ తన కొత్త శాటిలైట్ ఫోన్ సర్వీసును ప్రారంభించింది. మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లోనూ ఈ ఫోన్ పనిచేస్తుంది. ధర రూ. 1,34,166. అత్యవసర పరిస్థితులు, రక్షణ రంగంలో ఇది ఎంతో ఉపయోగకరం.
BSNL శాటిలైట్ ఫోన్ ధర ఎంత?
BSNL Satellite Phone : బీఎస్ఎన్ఎల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ వచ్చేసింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్పెషల్ శాటిలైట్ ఫోన్ సర్వీసును ప్రారంభించింది. మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఇకపై ఈజీగా కనెక్ట్ అవ్వొచ్చు.
అత్యవసర పరిస్థితులు, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో పనిచేసే వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంతకీ ఈ శాటిలైట్ ఫోన్ టెక్నాలజీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ధర ఎంత అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL శాటిలైట్ ఫోన్ ధర ఎంత? : బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ధర సుమారు రూ. 1,34,166గా ఉంది. ఈ సర్వీసుకు సంబంధించిన కొనుగోలు వివరాలకు బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక వివరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఎంక్వైరీ కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా సంప్రదించవచ్చు.
కఠిన పరిస్థితులకు తగిన డిజైన్
శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం సాధారణ మొబైల్ సర్వీసుల కన్నా చాలా ఖరీదైనది. అత్యాధునిక టెక్నాలజీ, ప్రత్యేక మౌలిక సదుపాయాలతో ఈ సర్వీసుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
Read Also : UK AI hardware Plan : చైనా, అమెరికాకు పోటీగా AI రేసులో బ్రిటన్ స్పీడ్ గేర్.. వేల కోట్లతో సూపర్ కంప్యూటర్, సొంత చిప్‌ల ప్లాన్!
కఠిన పరిస్థితులకు తగిన డిజైన్ : అంతర్జాతీయ శాటిలైట్ నెట్‌వర్క్‌ల సాకారంతో అభివృద్ధి చేసిన ప్రత్యేక హ్యాండ్‌సెట్‌గా బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ రూపొందించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా తయారుచేశారు. దుమ్ము, ధూళి, నీటిని తట్టుకునే సామర్థ్యం, లాంగ్ టైమ్ బ్యాటరీ సౌకర్యం ఉంటుంది. విద్యుత్ లేని ప్రాంతాల్లోనూ పనిచేసేలా ఈ ఫోన్లను డిజైన్ చేశారు. అత్యవసర సమయాల్లో క్లియర్ వాయిస్ కమ్యూనికేషన్‌తో పాటు SOS ఎమర్జెన్సీ హెల్ప్ ఫీచర్ కూడా ఉంది.
ఎక్కడ వాడతారు?
ఎక్కడ వాడతారంటే? : శాటిలైట్ ఫోన్లు సాధారణ సెల్యులార్ టవర్లపై పనిచేయవు. అందుకే ఈ ఫోన్లను ఎమర్జెన్సీ సేవలు, రక్షణ రంగం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు వాడుతుంటాయి.
* భద్రతా దళాలు, సరిహద్దు ప్రాంతాల్లో సైన్యానికి కమ్యూనికేషన్ * వరదలు, భూకంపం, తుఫాను వంటి విపత్తుల సమయంలో * ఓడలు, సముద్ర ప్రయాణాల్లో కనెక్టివిటీ * అటవీ పరిశోధన, మైనింగ్ రంగాల్లో పనిచేసేవారికి * మారుమూల పుణ్యక్షేత్రాలు, ఎత్తైన పర్వత ప్రాంతాలకు వెళ్లేవారికి
సాధారణ మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని పరిస్థితుల్లో శాటిలైట్ ఫోన్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కోసం ఒక విప్లవాత్మక చర్య. అత్యవసర సేవలు, రక్షణ రంగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


