|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రభాస్, అఖిల్ తో బుచ్చిబాబు సంచలనం.. టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్!

Published: 06-03-2026, 3:05 AM
షాకింగ్: ప్రభాస్, అఖిల్ తో బుచ్చిబాబు సంచలనం.. టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్!
  • బుచ్చిబాబు సన దర్శకత్వంలో ప్రభాస్, అఖిల్ లతో క్రేజీ ప్రాజెక్టులు సిద్ధం!
  • ప్రభాస్ కోసం ఒక కథ, అఖిల్ కోసం మరొక కథను సిద్ధం చేసిన బుచ్చిబాబు.
  • ప్రభాస్ కి కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
  • అఖిల్ తో సినిమా కోసం నిర్మాణ సంస్థ నుండి బుచ్చిబాబుకి బంపర్ ఆఫర్!

టాలీవుడ్ లో సంచలనం! బుచ్చిబాబు సన ఇప్పుడు ప్రభాస్ మరియు అఖిల్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

ప్రభాస్ తో బుచ్చిబాబు స్టోరీ ఒకే!

Buchi Babu Sana: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు బుచ్చి బాబు సన. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఖిల్ కోసం బంపర్ ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!

ఈ నేపధ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, పెద్ది తరువాత సినిమా కోసం బుచ్చిబాబు(Buchi Babu Sana) రెండు అద్భుతమైన కథలను సిద్ధం చేసుకున్నాడట. అందులో ఒకటి ప్రభాస్ కోసం కాగా.. రెండవది అక్కినేని అఖిల్ కోసం అని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే, ప్రభాస్ ని కలిసి ఆ కథను వినిపించాడట బుచ్చిబాబు. ఇక ప్రభాస్ కి కూడా కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడని సమాచారం.

త్వరలోనే క్రేజీ ప్రాజెక్టుపై ప్రకటన!

మరోపక్క, ప్రముఖ నిర్మాణ సంస్థ బుచ్చిబాబుకి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. తమ నెక్స్ట్ సినిమాను అఖిల్ తో చేయాలనుకుంటున్నామని, అందుకోసం అద్భుతమైన కథను సిద్ధం చేయాల్సిందిగా చెప్పారట. దానికి, తగ్గట్టుగా కూడా బుచ్చిబాబు కథను చెప్పాడట. ఆ కథ కూడా ఒకే అయినట్టుగా తెలుస్తోంది. ఇలా, పెద్ది తరువాత రెండు క్రేజీ ప్రాజెక్టులను సిద్ధం చేసిపెట్టుకున్నాడు బుచ్చిబాబు. ప్రభాస్, అఖిల్ ఇద్దరిలో ఎవరు ముందు ఫ్రీ అయితే వారితో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఈ ఇద్దరి స్టార్స్ లో ఎవరితో బుచ్చిబాబు తన నెక్స్ట్ సినిమా చేస్తాడు అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

బుచ్చిబాబు సన ప్రభాస్ మరియు అఖిల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి మరిన్ని వివరాల కోసం వేచి చూడండి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.