
📌 Key Points
- వన్ ప్లస్ నార్డ్ సీఈ 5: 6.77 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 8350 ప్రాసెసర్, 5200mAh బ్యాటరీతో లభిస్తుంది.
- వివో T4X: మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP కెమెరాతో విడుదల అయింది.
- రియల్‌మి నార్జో 90 లైట్ 5G: 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్ చిప్‌సెట్‌తో వస్తుంది.
- రియల్‌మి P4 పవర్: 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో లభిస్తుంది.
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 5000mAh బ్యాటరీతో వచ్చే ఫోన్లపై ఒక లుక్ వేయండి. మీ బడ్జెట్ కు తగ్గట్టు ఎంచుకోండి.
5000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లు
7 Budget Phones : ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు దొరుకుతున్నాయి. 2026లో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే 5000mAh బ్యాటరీతో బడ్జెట్ ఫోన్లపై ఓసారి లుక్కేయండి..
7 Budget Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి బడ్జెట్ ఫోన్ కొనుక్కోండి. అందులోనూ బ్యాటరీ బ్యాకప్ అద్భుతంగా ఉండే స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంటే ఇలాంటి బడ్జెట్ ఫోన్లను తీసుకోండి. చాలామంది ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఛార్జర్ తీసుకెళ్లడం మర్చిపోతుంటారు. సడన్ గా ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఛార్జింగ్ పాయింట్ కోసం చూస్తుంటారు. అయితే, కేబుల్ టైప్ కూడా సరిగా ఉండాలి. లేదంటే ఛార్జింగ్ సరిగా ఎక్కదు.
ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా రోజంతా ఛార్జింగ్ అందించే అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులోనూ భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌లను కొనుక్కొంటే బెటర్. బ్యాటరీ తొందరగా డిశార్ఛ్ కావు. పైగా ఎక్కువగా సేపు ఛార్జింగ్ నిలుస్తుంది. మీరు కూడా ఇలాంటి బడ్జెట్ ఫోన్ల కోసం చూస్తుంటే ఈ కింది 5000mAh బ్యాటరీ ఉన్న ఫోన్లలో ఏదైనా ఒకటి ఎంచుకుని కొనేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 (రూ. 22,999): వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ 6.77 అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 1B కలర్స్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ యూనిట్ 5200mAh బ్యాటరీతో వస్తుంది. 50MP + 8MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
వన్ ప్లస్, వివో, రియల్‌మి ఫోన్ల వివరాలు
వివో T4X (రూ. 16,999) : వివో T4X మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, ఫన్‌టచ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో వస్తుంది.
రియల్‌మి నార్జో 90 లైట్ 5జీ (రూ. 16,998) : 7000mAh బ్యాటరీతో ఈ యూనిట్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్ చిప్‌సెట్‌తో వస్తుంది. డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 1B కలర్ ఆప్షన్లతో 6.57 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
రియల్‌మి P4 పవర్ (రూ. 24,374): రియల్‌మి P4 పవర్ 6.8 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 1B కలర్స్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ యూనిట్ రియల్‌మి యూఐ 7.0పై రన్ అవుతుంది. 10001mAh బ్యాటరీ, 80W ఛార్జర్‌తో వస్తుంది.
Read Also : Vivo T5x 5G : వివో క్రేజే వేరబ్బా.. 7200mAh బ్యాటరీతో కొత్త వివో T5x 5G వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ధర ఎంత ఉండొచ్చంటే?
బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఫోన్లు
నథింగ్ ఫోన్ 4a (రూ. 23,999) : నథింగ్ ఫోన్ 4aలో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. 50MP + 50MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. నథింగ్ OS 4.1పై రన్ అవుతుంది. చివరగా, 5080mAh బ్యాటరీ, 50W ఛార్జర్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5జీ (రూ. 24,999) : శాంసంగ్ గెలాక్సీ M56 5జీలో ట్రిపుల్ రియర్ కెమెరాలు, 50MP + 8MP + 2MP, 12MP సెల్ఫీ కెమెరాతో ఉన్నాయి. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో ఈ యూనిట్ వన్ యూఐ 7 పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది.
రెడ్‌మి నోట్ 15 5జీ (రూ. 22,998): రెడ్‌మి నోట్ 15 5జీ ఫోన్ 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 68B కలర్ ఆప్షన్లు, 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 108MP + 8MP రియర్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అదనంగా, ఈ ఫోన్ 5520mAh బ్యాటరీ, 45W ఛార్జర్‌ను అందిస్తుంది.
ఈ కథనంలో పేర్కొన్న ఫోన్లు బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లను అందిస్తున్నాయి. మీ అవసరాలకు తగిన ఫోన్‌ను ఎంచుకుని, భారీ బ్యాటరీతో రోజంతా హ్యాపీగా ఉండండి.


