
బుధ, శని గ్రహాల సంయోగం సెప్టెంబర్ 17 రాత్రి జరుగుతుంది. ఈ సంయోగం కొన్ని రాశులకు ఆర్థికంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.
Key Points
మిధున, కన్యా, మకర రాశుల వారికి ఆర్థిక లాభాలు.
ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధి.
శుభ ఫలితాల కోసం నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
బుధ-శని సంయోగం ప్రభావం
బుధ, శని గ్రహాల కదలిక అనేక రాశులను ప్రభావితం చేస్తుంది. జ్ఞానానికి కారకుడైన బుధుడు, కర్మకు కారకుడైన శని ఒకదానికొకటి సంయోగం చెందడంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కుంటే, దీని కారణంగా కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 17 రాత్రి 11:15కు బుధుడు, శని 180 డిగ్రీల వద్ద సంయోగం చెందుతారు.
ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు రావడంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. బుధుడు అభివృద్ధి, వ్యాపారం, మాట మొదలైన వాటికి కారకుడు. శని న్యాయ దేవుడు. మనం చేసే పనులు ఆధారంగా శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను ఇస్తాడు. ఈ రెండు గ్రహాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకు రానున్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మిధున రాశి వారికి రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు సక్సెస్‌ను పొందుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. పని ప్రదేశంలో బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చు. కుటుంబ సమేతంగా కుటుంబమంతా మంచి సమయాన్ని గడుపుతారు.
అదృష్టవంతులైన రాశులు
కన్యా రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో సెప్టెంబర్ 17 నుంచి శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఏకాగ్రత పెరిగి చదువుపై దృష్టి పెడతారు.
వ్యాపారులకు కూడా ఇదే మంచి సమయం. ఎక్కువ లాభాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. విజయాలను అందుకుంటారు. ఎప్పటినుంచో పూర్తిగా కాని పనులు కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి.
జ్యోతిష్య నిపుణుల సూచనలు
మకర రాశి వారికి ఇది మంచి సమయం. ఈ రాశి వారు రెండు గ్రహాల కలయిక వలన మంచి ఫలితాలను ఎదుర్కొంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. వివాహ జీవితంలో సంతోషంగా లేని వారు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ జ్యోతిష్య సూచనలు సాధారణ సమాచారం మాత్రమే. ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి. మీ జీవితంలో సానుకూల మార్పులు రావాలని కోరుకుందాం.

