
జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు తెచ్చుకున్న బులెట్ భాస్కర్, తన మహేష్ బాబు మిమిక్రీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా, ఓ సినిమాకు మహేష్ బాబుకు డబ్బింగ్ చెప్పిన విషయాన్ని వెల్లడించాడు.
Key Points
జబర్దస్త్ బులెట్ భాస్కర్ మహేష్ బాబు డబ్బింగ్ చేశాడు.
వన్ నేనొక్కడ్నే సినిమాకు మొత్తం ట్రాక్ డబ్బింగ్ చేశాడు.
భాస్కర్ మహేష్ బాబు గారి పెద్ద అభిమాని.
బులెట్ భాస్కర్ మహేష్ బాబు మిమిక్రీ
Bullet Bhaskar – Mahesh Babu : జబర్దస్త్ లో తన కామెడీ స్కిట్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బులెట్ భాస్కర్ తన మిమిక్రితో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. భాస్కర్ ఎక్కువగా మహేష్ బాబు వాయిస్ ని మిమిక్రి చేస్తుంటాడు. పలు ఈవెంట్స్ లో, జబర్దస్త్ లో కూడా అప్పుడపుడు భాస్కర్ మహేష్ వాయిస్ ని మిమిక్రి చేసాడు. అయితే ఓ సినిమాకు మహేష్ బాబుకి ట్రాక్ డబ్బింగ్ చెప్పాడట బుల్లెట్ భాస్కర్.
వన్ నేనొక్కడ్నే డబ్బింగ్ అనుభవం
సాధారణంగా సాంగ్స్ కి మెయిన్ సింగర్ పాడే ముందు వేరే సింగర్ తో రఫ్ గా ఒక సారి పాడిస్తారు. అలాగే కొన్ని సినిమాలకు మెయిన్ హీరోలు డబ్బింగ్ చెప్పేముందు రఫ్ డబ్బింగ్ ఒక వర్షన్ చెప్పిస్తారు. డబ్బింగ్ ఎక్కడ ఎలా ఉండాలి అని సిమిలర్ వాయిస్ ఉన్న వాళ్ళతో చెప్పిస్తారు. ఆ తర్వాత అసలు హీరోలు అది చూసి డబ్బింగ్ చెప్తారు. అలా మహేష్ బాబు వన్ నేనొక్కడ్నే సినిమాకు బులెట్ భాస్కర్ తో చెప్పించారట.
మహేష్ బాబు ప్రతిస్పందన
తాజాగా బులెట్ భాస్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వన్ నేనొక్కడ్నే సినిమాకు నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను సినిమా మొత్తం. మహేష్ గారి వాయిస్ అచ్చు దించేసాను. తర్వాత మహేష్ బాబు గారు వచ్చి నా డబ్బింగ్ విని ఇంత బాగా చెప్పారు, ఎవరు చెప్పారు అని అడిగారట. మహేష్ బాబు గారు నా ఫేవరేట్ హీరో. నేను కృష్ణ గారి ఫ్యాన్ ని. ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. ఆయనతో ఒక్కసారి ఫోటో దిగాను అంతే. కలిసి మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
బులెట్ భాస్కర్ మహేష్ బాబు అభిమాని అని, ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని తెలిపాడు. భవిష్యత్తులో వీరిద్దరి సహకారం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


