|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bunny Vasu : 19 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ దగ్గరికి.. బన్నీకి వాచ్ మెన్ గా పెట్టారు..

Published: 12-06-2025, 8:10 AM
Bunny Vasu : 19 ఏళ్ళ వయసులో అల్లు అరవింద్ దగ్గరికి.. బన్నీకి వాచ్ మెన్ గా పెట్టారు..

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తన తొలినాళ్ల జీవితం గురించి, అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో అల్లు అరవింద్ గారి దగ్గరకు వచ్చి, అల్లు అర్జున్ కి వాచ్‌మెన్ గా పనిచేశారని తెలిపారు.

Key Points

1

బన్నీ వాసు 19 ఏళ్ల వయసులో అల్లు అరవింద్ గారి దగ్గరకు వచ్చారు.

2

అల్లు అర్జున్ కి వాచ్‌మెన్ గా పనిచేశారు.

4

తాజాగా తన నిర్మాణ సంస్థ 'బన్నీ వాసు వర్క్స్' ను ప్రారంభించారు.

బన్నీ వాసు జీవితంలో అల్లు అరవింద్ పాత్ర

Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో, బన్నీ పక్కనే ఉంటూ ఎదిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ – బన్నీ వాసు క్లోజ్ ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. వాసు బన్నీ పేరుని తన పేరు పక్కన పెట్టుకున్నాడు అంటేనే వారిద్దరి బంధం ఎంత గట్టిదో తెలుస్తుంది. గతంలో అనేకమార్లు బన్నీ వాసు అల్లు అర్జున్ లేకపోతే నేను లేను అని చెప్పారు. గీత ఆర్ట్స్, అల్లు అరవింద్ ని వదిలి వెళ్ళను అని కూడా పలుమార్లు తెలిపారు.

అయితే తాజాగా బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థ బన్నీ వాసు వర్క్స్ ప్రారంభించి మిత్రమండలి అనే సినిమాతో రాబోతున్నాడు. నేడు ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అల్లు అరవింగ్ గెస్ట్ గా వచ్చారు.

గీత ఆర్ట్స్ తో అనుబంధం

ఈ ఈవెంట్లో తన లవ్ స్టోరీ గురించి అడగ్గా బన్నీ వాసు మాట్లాడుతూ.. నేను 19 ఏళ్ళ వయసులో అరవింద్ గారి దగ్గరకు వచ్చాను. అక్కడ్నుంచి నన్ను బన్నీ కి వాచ్ మెన్ గా పెట్టేసారు. నా లైఫ్ అంతా అక్కడే సరిపోయింది. నా లైఫ్ లో లవ్ పార్ట్ మిస్ అయిందంటే దానికి కారణం వంద శాతం అల్లు అరవింద్ గారు, బన్నీనే కారణం అని సరదాగా అన్నారు.

బన్నీ వాసు వర్క్స్ ప్రారంభం

బన్నీ వాసు తన సినీ ప్రయాణం గురించి, అల్లు అరవింద్ మరియు అల్లు అర్జున్ తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కొత్త నిర్మాణ సంస్థతో ఆయన సినీ రంగంలో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.