|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bunny Vasu : తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక.. డబ్బులిచ్చి సినిమాపై నెగిటివ్ చేస్తున్నారు.. బన్నీ వాసు సంచలన కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి..?

Published: 13-10-2025, 1:13 PM
Bunny Vasu : తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక.. డబ్బులిచ్చి సినిమాపై నెగిటివ్ చేస్తున్నారు.. బన్నీ వాసు సంచలన కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి..?

నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తను నిర్మించిన “మిత్రమండలి” సినిమా అక్టోబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్రంపై కొందరు డబ్బులిచ్చి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనను తొక్కితే పడిపోతాడనుకోవడం అవివేకమని ఘాటుగా స్పందించారు.

Key Points

1

నిర్మాత బన్నీ వాసు 'మిత్రమండలి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

2

తన సినిమాపై కొందరు డబ్బులిచ్చి నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

4

ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎదుర్కొంటానని, తన ప్రయాణం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బన్నీ వాసు సంచలన కామెంట్స్ వెనుక అసలు కారణం

Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ వాసు నిర్మాణంలో వస్తున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హాజరయిన బన్నీ వాసు తన సినిమాని, తనని తొక్కడానికి చూస్తున్నారు అంటూ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.(Bunny Vasu)

బన్నీ వాసు మాట్లాడుతూ.. అందరి సినిమాలు హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి. అందరితో మనమూ ఎదగాలి. ఇది నా ఆటిట్యూడ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది. నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే ఇంకో సినిమా ఎదుగుద్ది అంటే అది మీ ఖర్మ. మేము ఎవ్వరం ఏమి చేయలేము. ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు. మీదైనా నాదైనా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది.

“మిత్రమండలి” ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఘాటు వ్యాఖ్యలు

ఒక సినిమా మీద డబ్బులు పెట్టి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఆ సినిమా తగ్గుతుంది, ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది చిన్నపిల్లాడి తత్త్వం. మన అందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి. కష్టపడదాం ఎదుగుదాం. అంతే కానీ ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఎదిగిపోతాం అంటే పైన దేవుడు ఉన్నాడు, ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు.

కాంపిటేషన్ లోనే ఉండాలి కానీ ధర్మం ఉండాలి. నేనైతే అన్ని సినిమాలు బాగుండాలనే కోరుకుంటాను. ఒకవేళ నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా బాగుండాలి అని కోరుకుంటాను. అదే నా మైండ్. అందుకే సక్సెస్ వస్తుంది. ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు, ఇక్కడ తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక. నా సంస్కారం ఏంటంటే తల వెంట్రుక తీసి ఇస్తున్నా. నా జర్నీ ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాను. మీ గురించి ఆలోచిస్తే ఇక్కడే ఉంటాను నేను. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్, రివ్యూస్ కి వెల్కమ్. ఏదైనా ఫేస్ చేస్తాను అని అన్నారు.

నెగటివ్ ట్రోల్స్‌పై బన్నీ వాసు ప్రతిస్పందన

దీంతో బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే బన్నీ వాసు ఎవరిని ఉద్దేశించి అన్నారు, బన్నీ వాసుని, బన్నీ వాసు సినిమాపై ఎవరు నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమాల్లోనే ఓ సినిమాకు సంబంధించిన నిర్మాతలు ఇది చేశారేమో అని పలువురు అనుకుంటున్నారు. మరి బన్నీ వాసు కామెంట్స్ మీద ఎవరైనా టాలీవుడ్ నుంచి స్పందిస్తారేమో చూడాలి.

బన్నీ వాసు వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పోటీ ఉండాలి కానీ ధర్మం తప్పకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ‘మిత్రమండలి’ సినిమా విడుదలకు ఏ విధంగా తోడ్పడుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.