|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థాంక్యూ ఫ్లాప్ పై బీవీఎస్ రవి సంచలన నిజాలు! నాగ చైతన్య సినిమాపై గుండె బద్దలయ్యే మాటలు!

Published: 19-06-2026, 9:49 AM
థాంక్యూ ఫ్లాప్ పై బీవీఎస్ రవి సంచలన నిజాలు! నాగ చైతన్య సినిమాపై గుండె బద్దలయ్యే మాటలు!
  • ‘థాంక్యూ’ ఫ్లాప్ పై రచయిత బీవీఎస్ రవి తీవ్ర ఆవేదన వ్యక్తం.
  • నాగ చైతన్య కెరీర్ లో అతి తక్కువ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం.
  • ‘కృతజ్ఞత’ కథను బలంగా నమ్మిన బీవీఎస్ రవి, దిల్ రాజు.
  • దర్శకుడు విక్రమ్ కె. కుమార్, చైతూపై ప్రేమను తెలిపిన రచయిత.

టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది! నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా ఫ్లాప్ పై రచయిత బీవీఎస్ రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే!

థాంక్యూ ఫ్లాప్ పై బీవీఎస్ రవి షాకింగ్ రియాక్షన్!

అక్కినేని నాగచైతన్య , డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ కాంబోలో వచ్చిన సినిమా ‘థాంక్యూ’. ‘మనం’ వంటి క్లాసిక్ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మారింది. అప్పటికే కోవిడ్ పాండమిక్ కారణంగా థియేటర్లకు దూరమైన జనాలను రప్పించలేకపోయింది. ఇది చైతూ కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా మిగిలిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలిసిపోయిందని రచయిత బీవీఎస్ రవి అంటున్నారు. ‘థాంక్యూ’ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించారు. మామూలుగా సొంత కథలతోనే సినిమాలు తీసే విక్రమ్ కుమార్‌.. తొలిసారిగా వేరే రచయిత రాసిన స్టోరీని తెరకెక్కించారు. తాజాగా బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘థాంక్యూ’ ప్లాప్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యానని చెప్పారు. ”నేను ఆ సినిమా కథను చాలా నమ్మాను. ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎందుకంటే ‘కృతజ్ఞత’ అనేది ఒక యూనివర్సన్ ఎమోషన్. నన్ను కన్నారు కాబట్టి అమ్మానాన్నల పట్ల కృతజ్ఞత ఉంటుంది. కానీ నాకు పరిచయం లేకుండా, నా జీవన ప్రయాణంలో కొన్నాళ్లు ఉండిపోయిన వాళ్లు నా జీవితంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఆ ఇంపాక్ట్ వల్ల ఎంత ఎదిగాను? అనేది తెలుసుకునేలోపే ఎంత అహంకారంగా ప్రవర్తించాను?. అది తెలుసుకున్నాక దానికి మూల్యంగా వారికి కృతజ్ఞత చెప్పడం, క్షమాపణలు అడగడం అనేదే ‘థాంక్యూ’ కథ” ”ఇప్పటివరకూ ఇలాంటి యునిక్ ఎమోషన్ ను ఎవరూ చెప్పలేదని నేనూ, దిల్ రాజు బాగా ట్రై చేశాం. నేను డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కి పెద్ద అభిమానిని. 24, ‘మనం’, ‘ఇష్క్’ లాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. ఎమోషన్ ను బాగా టచ్ చేస్తాడు. నా కథను చెప్పడానికి అలాంటి దర్శకుడు నాకు దొరికాడు. కానీ నా వైపు నుంచి తప్పు జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా కన్వే చేయలేపోయుండొచ్చు. చర్చల దశలో నేను అనుకున్నది తను అనుకోలేదో.. తను అనుకున్నది నేను అనుకోలేదో. అందరం అనుకున్నది ప్రేక్షకులు అనుకోలేదో. ఎక్కడో ఏదో మిస్ అయింది. నాకు ఇష్టమైన ప్రొడ్యూసర్, డైరెక్టర్. అందరి కంటే నాకు నాగార్జున మీద ఎక్కువ కృతజ్ఞత ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ నిర్మాత ఆయన. వాళ్ల అబ్బాయితో చేస్తున్న సినిమా ఇది. నాగ చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. కానీ మేమందరం కలిసి చేసిన ఈ సినిమా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది” * సమంత సినిమాకి పోటీగా అక్కినేని వారి ‘బాలన్’.. నాగ చైతన్య పోస్ట్ వైరల్ ”థ్యాంక్యూ సినిమాకి నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి వర్క్ చేశారు. అతను ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఏదో తేడాగా ఉందని మొదటి నుంచే చెబుతున్నాడు. ఆయనకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అతను ఆ విషయాన్ని నాకు మొహం మీద చెప్పకపోయినా.. నాతో చెప్పినదాన్ని బట్టి అర్థమైంది. ఏమో సన్నివేశాలు మేము సరిగా రాయకపోవచ్చు. తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు. విక్రమ్ కుమార్, దిల్ రాజు, నాగ చైతన్య మీద ఉన్న అభిమానంతో.. ఆశించిన ఫలితం రాలేదని నేను ఆ సినిమా విషయంలో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను” అని బీవీఎస్ రవి తెలిపారు.

నాగ చైతన్య సినిమాపై రచయిత గుండె బద్దలయ్యే మాటలు!

కృతజ్ఞత కథపై బీవీఎస్ రవి నమ్మకం.. ఎక్కడ తప్పింది?

‘థాంక్యూ’ సినిమా ఫ్లాప్ పై బీవీఎస్ రవి వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.