|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డైరెక్టర్ పా. రంజిత్ పై కేసు నమోదు: ‘వెట్టువం’

Published: 14-07-2025, 11:29 PM
డైరెక్టర్ పా. రంజిత్ పై కేసు నమోదు: 'వెట్టువం'

ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వం వహించిన ‘వెట్టువం’ చిత్ర షూటింగ్ సమయంలో స్టంట్ మాస్టర్ మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు అయింది. చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Key Points

1

ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ పై కేసు నమోదు.

2

వెట్టువం చిత్ర షూటింగ్ సమయంలో స్టంట్ మాస్టర్ మృతి.

4

నాగపట్టణం పోలీసులు కేసు నమోదు.

స్టంట్ మాస్టర్ మృతి

ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ (Director Pa Ranjith)పై కేసు నమోదు అయింది. నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న “వెట్టువం”{(Vettuvam) చిత్ర షూటింగ్ సందర్భంగా ఆదివారం స్టంట్ మాస్టర్ ఎస్.మోహన్ రాజు (52)(Stunt Master S. Mohan Raju) గుండెపోటుతో మృతి చెందారు. అయితే చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్లే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ.. డైరెక్టర్ పా. రంజిత్ తోసహా మరో ముగ్గురిపై నాగపట్టణం జిల్లాలోని కీళైయూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. నాగపట్నం పరిసర ప్రాంతాల్లో పలు ఛేజింగ్ సీన్లు షూట్ చేస్తుండగా.. స్టంట్ మాస్టర్ రాజుకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆసుపత్రికి చేర్చే సమయానికే ఆయన ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు.

నిర్లక్ష్యం ఆరోపణలు

పోలీసుల కేసు నమోదు

చిత్ర యూనిట్ నిర్లక్ష్యం వల్ల స్టంట్ మాస్టర్ మరణించారని ఆరోపణలు ఉన్నాయి. పా.రంజిత్ పై నమోదైన కేసు తదుపరి విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.