
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Key Points
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేసినందుకు బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు.
హైదరాబాద్ ట్రాఫిక్ లో రాంగ్ రూట్ లో వాహనం నడిపారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించారు.
సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ అయింది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) షాక్ తగిలింది. హీరోపై జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయింది. కాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు రోజుల క్రితం శ్రీనివాస్.. హైదరాబాద్ ట్రాపిక్‌లో హల్ చల్ సృష్టించాడు. రాంగ్ రూట్‌లో కారు డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ (Traffic rules Break) చేశాడు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ (Traffic Constable) అడ్డుకుని రాంగ్ రూట్‌లో రావడం ఏంటని నిలదీశాడు. దీంతో అతడు అక్కడి నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ (Traffic rules Break) చేయడంతో పాటు డ్యూటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఈ కేసు నమోదు అయినట్లు (case registered) స్పష్టంగా తెలుస్తుంది. మరీ ఈ ఇష్యూపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Hero Bellamkonda Srinivas) ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
పోలీసుల కేసు నమోదు
సోషల్ మీడియాలో వైరల్ వీడియో
ఈ ఘటనపై బెల్లంకొండ శ్రీనివాస్ స్పందన కోసం ఎదురు చూడాల్సి ఉంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం అని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.


