|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యాస్టింగ్‌ కౌచ్‌.. బలవంతం చేస్తే నచ్చదు: బాలీవుడ్‌ నటుడు సుధాన్షు పాండే

Published: 26-06-2025, 3:46 AM
క్యాస్టింగ్‌ కౌచ్‌.. బలవంతం చేస్తే నచ్చదు: బాలీవుడ్‌ నటుడు సుధాన్షు పాండే

బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడించాడు. ఒక దర్శకనిర్మాత చేసిన అసభ్య ప్రతిపాదనను తిరస్కరించానని, బలవంతం చేస్తే తనకు కోపం వస్తుందని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన సుధాన్షు పాండే…

Key Points

1

బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించాడు.

2

ప్రముఖ దర్శకనిర్మాత అసభ్య ప్రతిపాదన చేశారని, తాను తిరస్కరించానని తెలిపాడు.

4

సుధాన్షు పాండే 'రోబో 2.0', 'మన్మధుడు 2' వంటి తెలుగు సినిమాలలో నటించాడు.

సుధాన్షు పాండే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం

అడ్జస్ట్‌ అయితేనే అవకాశాలు ఇస్తామంటున్నారు అని ఎంతోమంది నటీమణులు మీడియా ముందు గోడు వెల్లబోసుకున్నారు. అయితే తనకూ అలాంటి పరిస్థితే ఎదురైందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు సుధాన్షు పాండే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధాన్షు పాండే మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నాను. ఓ ప్రముఖ దర్శకనిర్మాత తను అడిగింది చేస్తే మంచి ఆఫర్‌ ఇస్తానన్నాడు.

కాంప్రమైజ్‌ అయితేనే.. ఇప్పుడాయన బతికి లేడు. గొప్ప ఫిలింమేకర్స్‌లో ఆయన ఒకరు. ఆయన అడిగినదానికి కాంప్రమైజ్‌ అయితేనే రోల్‌ ఇస్తానన్నాడు. ఆయనపై నాకెలాంటి కోపం, పగ లేదు. ఎందుకంటే వాళ్లు అడిగినదానికి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయన అడిగింది నా వల్ల కాదని సున్నితంగా తిరస్కరించాను. మర్యాదగా అడిగాడు కాబట్టి అంతే గౌరవంగా బదులిచ్చాను.

ప్రతిపాదన తిరస్కరణ

బలవంతం చేస్తే నచ్చదు అలా కాకుండా నాతో అసభ్యంగా ప్రవర్తించుంటే లాగిపెట్టి కొట్టేవాడిని. ఎవరైనా నన్ను బలవంతం చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నాకు నచ్చినపనే చేస్తాను. నచ్చినవాటివైపే నిలబడతాను. ఇష్టం లేకుండా ఏ పనీ చేయను అని చెప్పుకొచ్చాడు. సుధాన్షు పాండే.. ఖిలాడీ 420, ద మిత్‌, యాకీన్‌, మర్డర్‌ 2, రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వంటి పలు చిత్రాలు చేశాడు. రోబో 2.0, మన్మథుడు 2 వంటి చిత్రాలతో తెలుగువారికీ సుపరిచితుడే.. ప్రస్తుతం మ్యూజిక్‌ వీడియల్లో నటిస్తున్నాడు.

బలవంతంపై ఆగ్రహం

సుధాన్షు పాండే తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చకు దారితీసింది. స్వీయ గౌరవం, నిర్ణయాధికారం ప్రాముఖ్యతను ఈ ఘటన హైలైట్ చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.