|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లోక్‌సభలో మహిళలకు భారీగా సీట్లు! కేంద్రం సంచలన నిర్ణయం!

Published: 16-04-2026, 5:35 AM
లోక్‌సభలో మహిళలకు భారీగా సీట్లు! కేంద్రం సంచలన నిర్ణయం!
  • డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం రాష్ట్రాలకు భరోసా
  • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపు ఇచ్చేందుకు కేంద్రం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది.
  • లోక్‌సభ స్థానాల సంఖ్య 815కు పెరిగితే, మహిళలకు 272 సీట్లు లభిస్తాయని కేంద్ర మంత్రి ప్రకటన.
  • మహిళా సాధికారత కోసం కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోంది.

డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు భరోసా ఇచ్చింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి మూడు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

డీలిమిటేషన్ పై కేంద్రం హామీ

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల (Women’s Reservation) విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ లోక్‍సభలో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు వీలుగా కేంద్రం 3 కీలక బిల్లులను లోక్‌సభలో (Lok Sabha) ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చసందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‍వాల్ (Arjun Ram Meghwal) మాట్లాడుతూ.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్ల ఏ రాష్ట్రానికి గాని, పురుషులకు గానీ ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు లోక్‍సభ సీట్లు కోల్పోవన్నారు. ఈ బిల్లులతో లోక్‍సభ స్థానాల సంఖ్యను 815కు పెరిగితే, మహిళలకు లోక్‍సభలో 272 సీట్లు లభిస్తాయన్నారు.

ఈ రోజు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని మేఘ్‍వాల్ అన్నారు. 2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ఆమోదం పొందింది. మహిళళకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం లభించిందని ఇక మహిళా రిజజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. ఆర్టికల్ 368 ద్వారా ద్వారా ప్రజాహిత నిర్ణయాలకు పార్లమెంట్‍కు రాజ్యాంగం శక్తి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మూడు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళల ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. మహిళలకు సామాజిక న్యాయం కోసం కేంద్రం అనేక పథకాలు తెచ్చిందని మహిళలకు శౌచాలయాలు, ఉజ్వల యోజన అమలు చేశామన్నారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాల్సిందేనన్నారు. మహిళలకు జన్‍ధన్ ఖాతాలు, పీఎం ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన, లఖ్ పతీ దీదీ వంటి పథకాలు అమలు చేశామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూత నిచ్చాం. మహిళల రిజర్వషన్లకు సంబంధించి మూడేళ్ల క్రితం ఇవే చర్చలు జరిగాయి.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు

మహిళా సాధికారతకు కేంద్రం కృషి

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో ఉందని ఈ బిల్లుల ద్వారా తెలుస్తోంది. మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.