
📌 Key Points
- యుజ్వేంద్ర చాహల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు, ఆపై RJ మహ్వాష్‌తో డేటింగ్ చేశారు.
- ప్రస్తుతం సింగిల్ లైఫ్ గడుపుతున్న చాహల్ నటి తానియా ఛటర్జీని ఫాలో అవుతున్నారు.
- తానియా ఛటర్జీ చాహల్ తనకి సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తున్నట్లు తెలిపింది.
- చాహల్ తనను ఫాలో అవుతున్నాడని తానియా ఆధారాలు బయటపెట్టడంతో వీడియో వైరల్ అయింది.
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచారు. నటి తానియా ఛటర్జీ, చాహల్ తనతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తున్నాడని ఆరోపించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాహల్ డేటింగ్ వ్యవహారాలు
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzi Chahal) గురించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మొదటి భార్య ధనశ్రీ వర్మకు విడాకులు ఇచ్చిన చాహల్, మొన్నటి వరకు RJ మహ్వాష్ అనే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడు. ఆమె కూడా మూడు నెలల కిందట చాహల్ కు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న చాహల్, హాట్ నటిగా పేరున్న తానియా ఛటర్జీని (Taniya Chatterjee ) ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
తానియా ఛటర్జీ ఆరోపణలు
భారత స్పిన్నర్ చాహల్ తనకు సోషల్ మీడియా వేదికగా నేరుగా మెసేజ్ లు పెడుతున్నట్లు తాజాగా నటి తానియా ఛటర్జీ షాకింగ్ నిజాలను బయట పెట్టారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే వెంటనే చాహల్ రియాక్ట్ అవుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు తనకు చాహల్ మెసేజ్ చేసినట్లు ఆధారాలు కూడా బయటపెట్టింది. తనను చాహల్ ఫాలో అవుతున్నాడని పేర్కొంది. దీంతో తానియా వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన చాహల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. చివరకు ఈ అమ్మాయిని కూడా వదలడం లేదా ? అంటూ చాహల్ పరువు తీస్తున్నారు.
వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
A post shared by Bollywood ADDA (@bollywood_adda_official)
మొత్తానికి చాహల్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తానియా ఛటర్జీ ఆరోపణలపై చాహల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.


