
📌 Key Points
- చైత్ర అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది.
- ఈ రోజున చేసే దానాల వలన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
- రాశి ప్రకారం దానం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు.
- అమావాస్య నాడు స్నాన, జప, తర్పణాల వల్ల పితృదేవతలు శాంతిస్తారు.
చైత్ర అమావాస్యకు హిందూ సంప్రదాయంలో విశేష స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజున పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదలడం, దానాలు చేయడం ఎంతో పుణ్యప్రదం.
అమావాస్య తిథి యొక్క విశిష్టత
అమావాస్య తిథికి, అందులోనూ చైత్ర మాసంలో వచ్చే అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర దినాన చేసే స్నాన, జప, తర్పణాల వల్ల పితృదేవతలు శాంతిస్తారని, వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. చైత్ర అమావాస్య సందర్భాంగా, ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో దానాలకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అమావాస్య అని అడుగుకునే దానాలు చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. రేపు చైత్ర అమావాస్య. చైత్ర అమావాస్య వేళ చేసే దానాలకు ఎంతో పుణ్యం వస్తుంది. చైత్ర అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తే వారి అనుగ్రహం కలుగుతుంది, ప్రశాంతత కూడా ఉంటుంది.
అమావాస్య నాడు స్నాన, దాన, తర్పణల వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఇక చైత్ర అమావాస్య నాడు ఏ రాశి వారు వేటిని దానం చేయాలి, ఎవరికి ఎలాంటి ఫలితం, ఎవరు ఏం దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: వృషభ రాశి వారు రేపు చైత్ర అమావాస్యనాడు బియ్యం, పాలు వంటి వాటిని దానం చేస్తే మంచిది. ఇలా తెల్లటి వాటిని దానం చేయడం వలన మంచి జరుగుతుంది. సానుకూల మార్పులను చూస్తారు, సంపద కూడా పెరుగుతుంది.
మిధున రాశి: మిధున రాశి వారు పెసలను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా దానం చేయడం వలన ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, సంతోషంగా ఉండొచ్చు.
రాశి ప్రకారం దానాల ప్రాముఖ్యత
కర్కాటక రాశి: ఈ రాశి వారు తెల్లటి వస్త్రాలను దానం చేయడం వలన మంచి జరుగుతుంది. కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.
సింహ రాశి: సింహ రాశి వారు బెల్లాన్ని దానం చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
కన్య రాశి: కన్య రాశి వారు మినప్పప్పును దానం చేయడం వలన మంచి జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్యనాడు దీనిని దానంగా చేయండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తులా రాశి: తులా రాశి వారు పెరుగును దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ప్రేమ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు బెల్లాన్ని దానం చేయడం వలన మంచి ఫలితాన్ని చూడచ్చు. ఒత్తిడి తగ్గుతుంది, సానుకూల శక్తి పెరుగుతుంది.
దానాల ద్వారా పితృదేవతల అనుగ్రహం
ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు పంచదారను దానం చేయడం మంచిది. దీంతో సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రేమ జీవితంలో మధురత ఉంటుంది.
మకర రాశి: మకర రాశి వారు ఆవాల నూనెను దానం చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. శని దోషం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.
కుంభ రాశి: ఈ రాశి వారు నల్ల నువ్వులను దానం చేస్తే మంచిది. సంతోషంగా ఉండొచ్చు.
మీన రాశి: మీన రాశి వారు పసుపు రంగులో ఉండే వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. భగవంతుని అనుగ్రహంతో సంతోషంగా ఉండడానికి వీలవుతుంది.
ఈ చైత్ర అమావాస్య రోజున మీ రాశి ప్రకారం దానాలు చేసి పితృదేవతల అనుగ్రహం పొందండి. సదా సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. శుభం భూయాత్!


