|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chammak Chandra : వాళ్ళు ఆర్టిస్టులు అయిపోయి నేను అవ్వలేదు.. అప్పుడే లైఫ్ & డెత్ అనుకున్నా.. చమ్మక్ చంద్ర ఎమోషనల్..

Published: 05-08-2025, 11:51 PM
Chammak Chandra : వాళ్ళు ఆర్టిస్టులు అయిపోయి నేను అవ్వలేదు.. అప్పుడే లైఫ్ & డెత్ అనుకున్నా.. చమ్మక్ చంద్ర ఎమోషనల్..

జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించిన చమ్మక్ చంద్ర, జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో నిరాశకు గురైన చమ్మక్ చంద్ర, తాజాగా జబర్దస్త్ 12వ వార్షికోత్సవం సందర్భంగా తన అనుభవాలను పంచుకున్నాడు.

Key Points

1

జబర్దస్త్ షో ద్వారా చమ్మక్ చంద్రకు అనూహ్యమైన గుర్తింపు లభించింది.

2

సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆయన ఎంతో నిరాశ చెందారు.

4

జబర్దస్త్ తో ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు వచ్చిందని చెప్పుకున్నారు.

జబర్దస్త్ ముందు చమ్మక్ చంద్ర జీవితం

Chammak Chandra : చమ్మక్ చంద్ర జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అనేక సినిమాల్లో నటించాడు. కానీ సరైన గుర్తింపు జబర్దస్త్ వచ్చేవరకు రాలేదు. జబర్దస్త్ లో గుర్తింపు వచ్చిన తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలు పడ్డాయి. ప్రస్తుతం చమ్మక్ చంద్ర జబర్దస్త్ ని వదిలేసి కేవలం సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు పలు టీవీ షోలు చేస్తున్నాడు.

తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ నిర్వహించగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సెలబ్రేషన్స్ కి పాత టీమ్ లీడర్స్ ని కూడా పిలిచారు. ఈ క్రమంలో చమ్మక్ చంద్ర కూడా వచ్చాడు. అప్పటి లీడర్స్ కి వాళ్ళు తెచ్చిన కమెడియన్స్, వాళ్ళ శిష్యులు పాద పూజ చేసారు.

జబర్దస్త్ ద్వారా వచ్చిన మార్పు

అనంతరం చమ్మక్ చంద్ర మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చాక నాతో పాటు ఉన్నా ధనరాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు. తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం ఇంకా అవ్వట్లేదు. ఆ డిజప్పాయింట్మెంట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ అవకాశం వచ్చింది. ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రాం ఒకటే అనుకున్నా అని చెప్తూ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

12 ఏళ్ల జబర్దస్త్ వేడుకలు మరియు చమ్మక్ చంద్ర భావోద్వేగాలు

మీరు కూడా జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ ప్రోమో చూసేయండి..

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.