|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డిసెంబరులో చాంపియన్

Published: 06-10-2025, 6:51 PM
డిసెంబరులో చాంపియన్

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘చాంపియన్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు పెరుగుతున్నాయి. రోషన్ కొత్త లుక్ చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

రోషన్ హీరోగా నటించిన 'చాంపియన్' డిసెంబరు 25న విడుదల కానుంది.

2

ఇది పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతోంది.

4

రోషన్‌ తన పాత్ర కోసం ఫిజికల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు.

‘చాంపియన్’ విడుదల తేదీ ఖరారు

క్రిస్మస్‌ పండక్కి థియేటర్స్‌లోకి వస్తున్నాడు చాంపియన్. నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘చాంపియన్’. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనశ్వర రాజన్‌ హీరోయిన్. జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

మరోవైపుపోస్ట్‌ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాగా, ‘చాంపియన్’ని డిసెంబరు 25న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించి, రోషన్ కొత్తపోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘ఇప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన  పాత్రలో కనిపించబోతున్నారు రోషన్‌. ఈ  పాత్ర కోసం  ఫిజికల్‌గానూ ట్రాన్్సఫర్మేషన్ అయ్యారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: ఆర్‌. మధి.

రోషన్ సరికొత్త లుక్

చిత్ర నిర్మాణ విశేషాలు

‘చాంపియన్’ సినిమా డిసెంబరులో విడుదలకు సిద్ధంగా ఉంది. రోషన్ అద్భుతమైన నటన, దర్శకుడి విజన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.