|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాంపియన్ ట్రైలర్ సునామీ: గ్లోబల్ స్టార్ లాంచ్‌తో రికార్డుల విధ్వంసం, ట్వీట్ సంచలనం!

Published: 20-12-2025, 12:04 AM
ఛాంపియన్ ట్రైలర్ సునామీ: గ్లోబల్ స్టార్ లాంచ్‌తో రికార్డుల విధ్వంసం, ట్వీట్ సంచలనం!
  • రోషన్, అనస్వర రాజన్ నటించిన ‘ఛాంపియన్’ ట్రైలర్ రిలీజ్.
  • రామ్ చరణ్ లాంచ్ చేసిన ట్రైలర్ 24 గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్ సాధించింది.
  • వైజయంతి మూవీస్ విడుదల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్.
  • ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రోషన్ హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమా ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ 24 గంటల్లోనే 8 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. వైజయంతి మూవీస్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్లోబల్ స్టార్ లాంచ్ చేసిన ‘ఛాంపియన్’ ట్రైలర్

రోషన్(Roshan), అనస్వర రాజన్(Answara Rajan) జంటగా నటిస్తున్న సినిమా ‘ఛాంపియన్'(Champion). ప్రదీప్ అద్వైత్(Pradeep Advaith) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇందులో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి(Kalyan Chakravarthy), అర్చన(Archana) కీలక పాత్రల్లో నటించారు. ఇక మిక్కీ జే మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గిరగిర, సల్లంగుండాలే పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్(Trailer) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ 8 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ వారు తన ఎక్స్‌లో తెలుపుతూ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు.

రికార్డుల విధ్వంసం.. 8 మిలియన్ల వ్యూస్

‘ఛాంపియన్ పై ఉన్న ఆరోపణలు ఉరుములతో కూడిన దాడితో పేలిపోయాయి.. ఛాంపియన్ ట్రైలర్ YouTubeలో 8 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు ట్రెండింగ్‌ను దాటింది.. డిసెంబర్ 25 నుంచి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానుంది’ అని రాసుకొస్తూ రోషన్ సీరియస్ మోడ్‌లో గన్ పట్టుకొని కాలుస్తున్న ఫొటో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

డిసెంబర్ 25న సినిమా విడుదల

The charge of #Champion explodes with a thundering strike 🔥 #ChampionTrailer croses 8 MILLION+ VIEWS and TRENDING on YouTube 💥💥▶️ https://t.co/dr9tYJMNMV In cinemas worldwide from DECEMBER 25th, 2025. #Roshan @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 … pic.twitter.com/WjqXd5yV5M

ఛాంపియన్ ట్రైలర్ సాధించిన అద్భుతమైన విజయం సినిమాపై భారీ అంచనాలను పెంచింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మద్దతు, వైరల్ ప్రచారం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. డిసెంబర్ 25న సినిమా థియేటర్లలోకి రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.