
సినిమా ప్రమోషన్లలో కొత్త ట్రెండ్ మొదలైంది. యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి తన తాజా చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’ కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన పాటలోని హుక్ స్టెప్ రీల్ చేసి పంపితే ఏకంగా లక్ష రూపాయల బహుమతి గెలుచుకోవచ్చని వెల్లడించింది. ఈ ఆఫర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది.
Key Points
సినిమా ప్రమోషన్లకు దర్శక, నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి రూ. 1 లక్ష భారీ బహుమతి ప్రకటించింది.
ఈ ఆఫర్ 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా ప్రమోషన్స్‌లో భాగం.
'తెలుసా' సాంగ్ హుక్ స్టెప్ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌కు పంపాలి.
సినిమా ప్రమోషన్స్‌లో కొత్త ట్రెండ్
సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దర్శక, నిర్మాతలు నానా తంటాల పడుతున్నారు. ఎంత ప్రమోషన్స్ చేసినప్పటికీ జనాలు థియేటర్స్‌కి రాకపోవడంతో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. దీంతో గత కొద్ది రోజుల నుంచి మూవీ మేకర్స్ కొన్ని రోజుల ముందు నుంచే పలు విధాలుగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌లోనే పలు బహుమతులు ప్రకటిస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమాల విడుదలయ్యాక బై వన్ గెట్ వన్ అంటూ టికెట్స్‌ను తక్కువ రేట్‌కు ఇస్తున్నారు. తాజాగా, యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి(Chandini Chowdhury) మాత్రం తన పాటలోని హుక్ స్టేప్ వేసిన రీల్‌ను పంపింస్తే ఏకంగా రూ.1 లక్ష బహుమతిగా ఇస్తానని ప్రకటించింది.
చాందినీ చౌదరి, విక్రాంత్(Vikranth) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్ లపు అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇక ఇటీవల ‘సంతాన ప్రాప్తిరస్తు’నుంచి విడుదలైన తెలుసా సాంగ్ హుక్ స్టెప్ క్రియేట్ చేసి ఈ రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మధుర టీమ్‌కు పంపితే బెస్ట్ స్టెప్ చేసిన వారికి బహుమతిగా రూ.1లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు హుక్ స్టెప్ క్రియేట్ చేసే పనిలో పడ్డారు.
చాందినీ చౌదరి బంపర్ ఆఫర్
‘సంతాన ప్రాప్తిరస్తు’ రీల్ ఛాలెంజ్
చాందినీ చౌదరి ప్రకటించిన ఈ భారీ బహుమతి ఆఫర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాకు మంచి పబ్లిసిటీని తెస్తోంది. ఇలాంటి వినూత్న ప్రమోషన్లు ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నెటిజన్లు ఇప్పటికే రీల్స్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.


