
📌 Key Points
- చంద్రహాస్ మూవీ ‘బరాబర్ ప్రేమిస్తా’ ఫిబ్రవరి 6న రిలీజ్, టాక్ ఏంటో చూద్దాం!
- శ్రీలీల డాన్స్ గురించి చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు, దుమారం రేపుతున్న కామెంట్స్!
- మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా, సంపత్ రుద్ర దర్శకత్వంలో ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ!
- రుద్రారం గ్రామంలో ప్రేమకథ, కుల విద్వేషాల నేపధ్యంలో చిత్రం!
టాలీవుడ్ లో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేసిన కామెంట్స్. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో వస్తున్న చంద్రహాస్ హీరోయిన్ శ్రీలీల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
శ్రీలీలపై చంద్రహాస్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వస్తున్నారు. ఇందులో కొంత మంది హీరోలు సక్సెస్ అవుతుంటే, మరి కొంత మంది సక్సెస్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటీవీ ప్రభాకర్ కుమారుడు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ( Attitude Star Chandrahas) డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా సెన్సేషన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న ఓ పాట పాడి పెంట పెంట చేశారు చంద్రహాస్. ఈ వివాదం నేపథ్యంలో చంద్రహాస్ పై కేసు కూడా నమోదయింది. అయితే ఈ సంఘటన మర్చిపోకముందే హీరోయిన్ శ్రీ లీల డాన్స్ పై హాట్ కామెంట్స్ చేశారు చంద్రహాస్. దీంతో ఈ కామెంట్లు కూడా ఇప్పుడు వివాదంగా మారాయి.
హీరో చంద్రహాస్ నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ( Barabar Premistha). ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసుకునే క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నాడు హీరో చంద్రహాస్. అయితే ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ లీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రహాస్. ఒక పాట స్త్రీలతో తనకు పడితే ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందని బాంబు పేల్చారు. తను నాతో పోటీగా డాన్స్ చేస్తే బాగుంటుంది కూడా వ్యాఖ్యానించారు. అంతేకాదు శ్రీ లీల తనకంటే తక్కువ డాన్స్ చేస్తుంది అనే మీనింగ్ వచ్చేలా ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడడం వివాదంగా మారింది. దీంతో చంద్రహాస్ పైన శ్రీ లీల ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్లింగ్ చేస్తున్నారు. నీ ముఖానికి ఎప్పుడైనా డాన్స్ చేసావా? ఒక్క పాట పాడితేనే ఇంత పెంట పెట్టావు ? ఇప్పుడు హీరోయిన్ శ్రీ లీల డాన్స్ గురించి మాట్లాడుతున్నావా ? అని మండిపడుతున్నారు.
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రమోషన్స్ అదుర్స్!
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ( Attitude Star Chandrahas) నటించిన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా Barabar Premistha). ఈ సినిమాలో మేఘన ముఖర్జీ హీరోయిన్ గా (Meghana Mukharji ) నటించారు. ఈ మూవీకి సంపత్ రుద్ర దర్శకత్వం వహించగా సీసీ క్రియేషన్స్, ఏవిఆర్ మూవీ వండర్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు. అదిలాబాద్ జిల్లాలోని రుద్రారం అనే గ్రామంలో రెండు వర్గాలు ఉంటాయి. ఆ రెండు వర్గాల మధ్య కుల విద్వేషాలు, పరువు, ప్రతిష్ట అంటూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ చిగురుస్తుంది. దాని కోసం ఈ ఇద్దరు పడే కష్టమే సినిమా కథ. అయితే, లవ్ నేపథ్యంలో వచ్చిన బరాబర్ ప్రేమిస్తా సినిమా జనాలకు పెద్దగా ఎక్కనట్లే కనిపిస్తోంది. సినిమా చూసిన వాళ్లు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.
ట్రోలింగ్ చేస్తున్న శ్రీలీల ఫ్యాన్స్!
A post shared by News18 Telugu (@news18telugu)
చంద్రహాస్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.


