
📌 Key Points
- విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో కీలకమైన నాలుగు భారీ ప్రాజెక్టులను కోల్పోయాడు.
- గీత గోవిందం తర్వాత స్టార్ డైరెక్టర్‌తో చేయాల్సిన ‘హీరో’ సినిమా ఆగిపోయింది.
- ‘లైగర్’ ప్లాప్ వల్ల పూరి జగన్నాధ్ తో ‘జన గణ మన’ ప్రాజెక్ట్ రద్దయింది.
- సుకుమార్ సినిమా, ‘కింగ్డమ్ 2’ సీక్వెల్ కూడా అనుకోని కారణాల వల్ల నిలిచిపోయాయి.
విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నాలుగు భారీ ప్రాజెక్టులను కోల్పోయాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత వచ్చిన వరుస ప్లాప్‌లు, కొన్ని అనుకోని కారణాల వల్ల స్టార్ డైరెక్టర్లతో చేయాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఈ చేజారిన అవకాశాలు రౌడీ హీరో భవిష్యత్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
విజయ్ కెరీర్ మలుపు తిప్పే సినిమాలు
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా చేయాల్సిన నాలుగు సినిమాలు ఆగిపోయాయి. లిస్టులో స్టార్ డైరెక్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
Vijay Deverakonda four films cancelled as hero
Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో నేషనల్ వైడ్ ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమాతో ఆ క్రేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. దాంతో, బాలీవుడ్ స్టార్స్ సైతం ఈ హీరోతో సినిమాలు చేసేందుకు చాలా ట్రై చేశారు. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీలకు సైతం మనోడు క్రష్ గా మారిపోయాడు.
చేజారిన స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులు
కానీ, ఆ తరువాత ఎం జరిగిందో తెలియదు. వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తూ రేస్ లో వెనుకబడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). గీత గోవిందం తరువాత ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు విజయ్. అయితే, హిట్స్ లేకపోవడం వేరు కానీ ఈ ప్లాప్స్ వల్ల విజయ్ చేయాల్సిన నాలుగు సినిమాలు ఆగిపోయాయి. ఆ సినిమాలు గనక విజయ్ చేసుంటే ఇప్పుడు అతని స్థానం ఒక రేంజ్ లో ఉండేది.
Malavika Mohanan: సందీప్ రెడ్డి హీరోయిన్స్ ప్రెజెంటేషన్ క్రేజీ ఉంటది.. అప్పుడు కియారా ఇప్పుడు త్రిప్తి.. మాళవిక కోరిక అదేనా!
ఆ లిస్టులో మొదటగా వచ్చే సినిమా ‘హీరో’. గీత గోవిందం సినిమా తరువాత ఒక స్టార్ డైరెక్టర్ విజయ్ కోసం హీరో అనే అదిరిపోయే కథను రెడీ చేశాడట. కథ అంతా సిద్ధం అయ్యింది ఇక షూటింగ్ వెళ్లడమే ఆలస్యం అనుకునే టైంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అలా మొదటి ఛాన్స్ మిస్ అయ్యాడు విజయ్.
లైగర్ ప్లాప్ తెచ్చిన నష్టాలు
విజయ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తో లైగర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే పూరి జగన్నాధ్ తో మరోసారి ‘జన గణ మన’ అనే మరో పాన్ ఇండియా మూవీని స్టార్ట్ చేశాడు విజయ్. కానీ, లైగర్ ప్లాప్ వల్ల జనగణమన సినిమా ఆగిపోయింది. ఇది పూరి జగన్నాధ్ కి డ్రీం ప్రాజెక్టు అవడం విశేషం.
పుష్ప తరువాత సుకుమార్ విజయ్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. కానీ, రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ఇక కింగ్డమ్ 2 ఉండదని చెప్పుకొచ్చాడు. ఇలా తన కెరీర్ లో నాలుగు పెద్ద సినిమాలను మిస్ చేసుకున్నాడు విజయ్.
మొత్తంగా, విజయ్ దేవరకొండ కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇన్ని కీలకమైన ప్రాజెక్టులు ఆగిపోవడం అతని అభిమానులకు నిరాశ కలిగించే వార్తే. ఈ పరిణామాలు అతని భవిష్యత్ సినిమాల ఎంపికపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి.


