|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాళవిక మోహనన్ సంచలన నిజాలు! రాజాసాబ్ డూప్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్! వైరల్ న్యూస్!

Published: 14-02-2026, 2:35 AM
మాళవిక మోహనన్ సంచలన నిజాలు! రాజాసాబ్ డూప్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్! వైరల్ న్యూస్!
  • రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహనన్ యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ వాడటం హాట్ టాపిక్!
  • రిస్కీ షాట్స్ లో డూప్ వాడటం సాధారణమేనని మాళవిక మోహనన్ క్లారిటీ ఇచ్చింది.
  • ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ నుండి వస్తున్న ట్రోల్స్ కి మాళవిక సమాధానం.
  • ఓటీటీ విడుదల తరువాత రాజాసాబ్ సినిమాపై ట్రోలింగ్ మరింత ఎక్కువైంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా విడుదలైనప్పటి నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా ఈ ట్రోల్స్ పై స్పందించింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

రాజాసాబ్ ట్రోలింగ్స్ పై మాళవిక రియాక్షన్

Malavika Mohanan: ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది రాజసాబ్ అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇక అప్పటినుంచి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి, ఇటు నెటిజన్స్ నుంచి ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి.

ఇక ఓటీటీ విడుదల తరువాత ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయ్యింది. అసలు సినిమాలో నటించింది ప్రభాస్ కాదని, చాలా చోట్ల డూప్ ను వాడారని స్క్రీన్ షాట్స్ తీసి మరి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక వీఎఫెక్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయంటూ కూడా ఆడేసుకున్నారు. ఇక తాజాగా ఈ లిస్టులోకి రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళవిక మోహనన్ కూడా చేరింది. కారణం ఏంటంటే, సినిమాలో మాళవిక(Malavika Mohanan) కోసం కూడా డూప్ ను వాడారు.

యాక్షన్ సీన్స్ లో డూప్ వాడటంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కి డూప్ వాడటం ఏంట్రా బాబు అంటూ మరోసారి ట్రోలింగ్ మొదలయ్యింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంది. ఆ సమయంలో మాళవిక కోసం తన డూప్ ను వాడాల్సి వచ్చింది. దీంతో, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

అయితే, తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించింది మాళవిక మోహనన్. “నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే రాజాసాబ్ లో యాక్షన్ సీక్వెన్ చేశాను. అన్ని షాట్స్ నేనే చేశాను. కానీ, రిస్కీ షాట్స్ కోసం నా డూప్ ను వాడారు. యాక్టర్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలా డూపులను వాడటం అనేది సాధారణమే” అంటూ పోస్ట్ పెట్టింది మాళవిక. దీంతో మాళవిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇకనైనా రాజాసాబ్ సినిమాపై వస్తున్న ట్రోలింగ్ కి ఎండ్ కార్డు పడుతుందా అనేది చూడాలి.

మాళవిక మోహనన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ సినిమాపై వస్తున్న ట్రోలింగ్స్ కి ఇది ఎండ్ కార్డ్ అవుతుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.