|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ సంచలన ఆరోపణలు! నాన్న వల్లే అవకాశాలు రాలేదన్న యాటిట్యూడ్ స్టార్!

Published: 26-01-2026, 7:35 AM
ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ సంచలన ఆరోపణలు! నాన్న వల్లే అవకాశాలు రాలేదన్న యాటిట్యూడ్ స్టార్!
  • నటుడు చంద్రహాస్ తండ్రి ప్రభాకర్ వారసత్వంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
  • ‘రాంనగర్ బన్నీ’, ‘కాయిన్’ చిత్రాలతో చంద్రహాస్ ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించారు.
  • చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ ఫిబ్రవరి 6న విడుదల కానుంది.
  • ప్రభాకర్ కొడుకు కావడం వల్లే అవకాశాలు రాలేదని చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి నటుడు కావడం వల్లే తనకు సినిమా అవకాశాలు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రభాకర్ వారసుడిగా చంద్రహాస్ సినీ రంగ ప్రవేశం

Chandrahas: నటుడు చంద్రహాస్ అంటే పెద్దగా ఎవరికి గుర్తుకురారు కానీ ఆటిట్యూడ్ స్టార్ (Attitude star)అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకొస్తారు. చేసింది. ఒక్క సినిమా అయినా తన ఆటిట్యూడ్ తో భారీగా విమర్శలను ఎదుర్కొని వార్తలలో నిలిచిన చంద్రహాస్ (Chandrahas) బుల్లితెర నటుడు ప్రభాకర్ (Prabhkar) కొడుకు అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రహాస్ తన తండ్రి వారసత్వం ద్వారా 2019వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రాంనగర్ బన్నీ, కాయిన్ లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ అవ్వటమే కాకుండా చంద్రహాస్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.

ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ చంద్రహాస్ యాటిట్యూడ్ మాత్రం మారలేదని చెప్పాలి. చంద్రహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha). ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రహాస్ మరొక బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెర నటుడిగా ప్రభాకర్ ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన వారసుడిగా చంద్రహాస్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సక్సెస్ పక్కన పెడితే విమర్శలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.

విమర్శలు ఎదుర్కొన్న చంద్రహాస్.. కారణం అదేనా?

ఇలా విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకోలేని నేపథ్యంలో ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రభాకర్ గారి కొడుకు కాకపోయి ఉంటే నాకు ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు వచ్చేవని కేవలం ఆయన కొడుకు కావడం వల్లే ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రభాకర్ కొడుకు కావటం వల్లే తన కెరియర్ ఇలా ఉందని చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో..

‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీతో చంద్రహాస్ రీఎంట్రీ

ఇక బరాబర్ ప్రేమిస్తా సినిమా విషయానికి వస్తే చంద్రహాస్,మేఘన ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంపత్ రుద్ర దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ సంస్థల మీద గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మాతలుగా కొనసాగుతున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కూడా సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి. ఇక ఈ సినిమాతో కచ్చితంగా తాను హిట్ కొట్టబోతున్నానంటూ మరోసారి చంద్రహాస్ మాట్లాడటంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. స్వచ్ఛమైన తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ వచ్చి ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండి అంటూ చంద్రహాస్ తెలియజేశారు.

మొత్తానికి చంద్రహాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.