|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుపమకు షాక్ ఇచ్చిన చంద్రహాస్! ఇంతకీ కారణం ఏమై ఉంటుంది? సంచలనంగా మారిన కామెంట్స్!

Published: 01-02-2026, 9:35 AM
అనుపమకు షాక్ ఇచ్చిన చంద్రహాస్! ఇంతకీ కారణం ఏమై ఉంటుంది? సంచలనంగా మారిన కామెంట్స్!
  • చంద్రహాస్ అనుపమను రిజెక్ట్ చేయడానికి గల కారణాలను వెల్లడించారు.
  • మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్, శ్రీలీలతో పెళ్లికి చంద్రహాస్ ఆసక్తి చూపించారు.
  • నెపోటిజం విమర్శలపై చంద్రహాస్ తనదైన శైలిలో స్పందించారు.
  • రామ్ నగర్ బన్నీ సినిమాతో చంద్రహాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేస్తానని చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

అనుపమను రిజెక్ట్ చేసిన చంద్రహాస్

Chandrahas: ఇటీవల ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో జరిగిన సరదా గేమ్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఒక గేమ్ ఆడించారు. “ఒకరిని రిజెక్ట్ చేయండి, ఒకరితో డేట్‌కు వెళ్లండి, మరొకరిని పెళ్లి చేసుకోండి” అంటూ ముగ్గురు హీరోయిన్ల ఫోటోలు చూపించారు. ఆ ఫోటోల్లో అనుపమ పరమేశ్వరన్, మృణాల్ ఠాకూర్, శ్రీలీల ఉన్నారు.

ఈ ప్రశ్నకు చంద్రహాస్ ఎలాంటి ఆలోచన లేకుండా “అనుపమ పరమేశ్వరన్‌ను రిజెక్ట్ చేస్తాను” అని చెప్పారు. ఇది విన్న యాంకర్ అరియాన కూడా కాస్త ఆశ్చర్యపోయారు. వెంటనే మరి ఎవరినో ఒకరిని డిలీట్ చేయాలి కదా అని అడిగారు. ఆ తరువాత చంద్రహాస్ మాట్లాడుతూ, “మృణాల్ ఠాకూర్ చాలా పద్ధతిగా, అందంగా ఉంటుంది కాబట్టి ఆమెతో డేట్‌కు వెళ్తాను. శ్రీలీలను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పారు. ఇది సరదాగా చెప్పిన మాటలే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోను ట్రోలింగ్‌కు ఉపయోగించారు. ఈయన ఏకంగా అనుపమనే రిజెక్ట్ చేశారా అందు కామెంట్లు పెడుతున్నారు.

డేటింగ్, పెళ్లి గురించి చంద్రహాస్ కామెంట్స్

చంద్రహాస్ గురించి చెప్పాలంటే, ఆయన నటుడు ఈటీవీ ప్రభాకర్ కొడుకు. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అంటూ చాలామంది విమర్శలు చేస్తుంటారు. అయితే చంద్రహాస్ మాత్రం ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోడు. సినిమాల్లోకి రాకముందే తన యాటిట్యూడ్‌తో “యాటిట్యూడ్ స్టార్” అనే పేరు తెచ్చుకున్నాడు. చూడ్డానికి హీరోలా ఉండటం, డాన్స్ బాగా చేయడం ఆయన ప్లస్ పాయింట్లు.

అతని తొలి సినిమా రాం నగర్ బన్నీ..మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని మాటలు తప్పుగా కట్ చేసి వైరల్ చేయడంతో చంద్రహాస్ క్లారిటీ ఇచ్చాడు. “నేను మా నాన్నగారి పేరు మీద గర్వపడతాను. ఈటీవీ ప్రభాకర్ కొడుకుగా పిలిస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది” అని స్పష్టంగా చెప్పాడు.

నెపోటిజంపై చంద్రహాస్ స్పందన

మొత్తానికి చంద్రహాస్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన త్వరలో ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.