|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివి వడ్త్యా సంచలన వ్యాఖ్యలు: అవకాశాల వేటలో మోసాలు! టాలెంట్ ఉంటేనే భవిష్యత్తు!!

Published: 04-02-2026, 2:05 AM
దివి వడ్త్యా సంచలన వ్యాఖ్యలు: అవకాశాల వేటలో మోసాలు! టాలెంట్ ఉంటేనే భవిష్యత్తు!!
  • అవకాశాల కోసం తప్పుడు మార్గాల్లో వెళ్తే ఉపయోగం లేదని దివి అన్నారు.
  • సినిమా ఛాన్స్ కోసం వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడం వల్ల కెరీర్‌కు నష్టం వాటిల్లుతుందని దివి అభిప్రాయపడ్డారు.
  • కొంతమంది అమ్మాయిలను చులకనగా చూస్తారని, ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాలను తాకడానికి ప్రయత్నించాడని దివి తెలిపారు.
  • నటన, డాన్స్ మరియు ఆసక్తి ఉంటేనే సినిమా రంగంలో రాణించగలమని దివి పేర్కొన్నారు.

సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురుచూసే నటీనటులు ఎదుర్కొనే సవాళ్ల గురించి దివి వడ్త్యా మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్ వంటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ, టాలెంట్ ఉంటేనే పరిశ్రమలో రాణించగలమని ఆమె స్పష్టం చేశారు.

కాస్టింగ్ కౌచ్ పై దివి వడ్త్యా స్పందన

Divi Vadthya: సినిమా రంగం అంటే బయట నుండి చూసే వారికి ఎంతో గ్లామరస్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ, ఇక్కడికి వచ్చే కొత్త నటీనటులు ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న ‘కాస్టింగ్ కౌచ్’ అనే పదం ఇండస్ట్రీ ప్రతిష్టను మసకబారుస్తోంది. ఈ అంశంపై తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటి దివి వడ్త్యా తనదైన శైలిలో స్పందించి, నేటితరం ఆర్టిస్టులకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు.

Read also- Actress Manjula : మా పెళ్లి జరగడానికి కారణం అదే.. టాప్ సీక్రెట్ ను బయటపెట్టేసిందిగా..!

అవకాశాల కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవద్దు

అవకాశాల కోసం తప్పుడు మార్గాల్లో వెళ్లడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని దివి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. “ఎవరో ఏదో ఆశ చూపారని లేదా ఎవరో ఒకరితో తిరిగినంత మాత్రాన అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబడవు” అని ఆమె స్పష్టం చేశారు. కేవలం సినిమా ఛాన్స్ కోసం వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడం వల్ల కెరీర్‌కు ఒరిగేదేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా కొంత మంది ఈ గ్లామరస్ ఫీల్డ్ లో అమ్మాయిలను చులకనగా చూస్తారని, ఇటీవల జరిగిన ఒక ఇన్సిడెన్ట్ గురించి చెప్పుకొచ్చారు. ఒక ఈ వెంట్ కు వెళ్లి వస్తుంటే..ఒకడు తన ప్రైవేట్ భాగాల్లో టచ్ చేయడానికి ప్రయత్నించాడని, వెంటనే మెల్కొని లాగి పీకానన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read also- Mega158 Update: బాబి కొల్లి ‘మెగా 158’లో చిరంజీవి డాటర్ ఫిక్స్.. ఎవరంటే?

నైపుణ్యమే ప్రధానం అని దివి సూచన

దివి మాటల్లో చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి నటనపై పట్టు మరియు ప్రతిభ (Talent) మాత్రమే ఏకైక మార్గం. “సినిమా అనేది కేవలం ఎవరితోనో ఎక్కడికో వెళ్తేనో జరిగే ప్రక్రియ కాదు. మీకు నటించడం వచ్చి ఉండాలి, డాన్స్ తెలిసి ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా మీకు నటనపై ఆసక్తి ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. లుక్స్ అనేవి ఒక స్థాయి వరకే పని చేస్తాయని, కానీ నిలబడాలంటే మాత్రం నైపుణ్యం ఉండాల్సిందేనని ఆమె బలంగా నమ్ముతారు. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే అమ్మాయిలు భయపడకూడదని, పరిస్థితులను ఎదుర్కొనే తెలివితేటలు కలిగి ఉండాలని ఆమె సూచించారు. “ఎవడో ఒక ఎదవ వచ్చి ఏవో రెండు డైలాగులు వేయగానే భయపడి పారిపోకూడదు. అతనికి తగిన సమాధానం చెప్పేలా మనం చదువుకోవాలి, లోకజ్ఞానాన్ని పెంచుకోవాలి” అని దివి చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లు ఇండస్ట్రీ అందరికీ సురక్షితమైన ప్రదేశమేనని, అయితే మనం ఎంచుకునే మార్గం, మన చుట్టూ ఉండే వ్యక్తులను బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని దివి తన ఇంటర్వ్యూలో వివరించారు. లొంగిపోవడం కాదు, పోరాడటం మరియు ప్రతిభను నిరూపించుకోవడమే అసలైన గెలుపు అని ఆమె నిరూపించారు.

దివి మాటల్లో చెప్పాలంటే, సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రతిభ, నైపుణ్యం చాలా అవసరం. అవకాశాల కోసం ఎదురుచూసే అమ్మాయిలు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె సూచించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.