|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మృణాల్ ఠాకూర్ వింత ఫుడ్ సీక్రెట్: ఐస్‌క్రీమ్ రైస్‌కు బానిసైన సీతారామం బ్యూటీ!

Published: 04-06-2026, 4:31 PM
మృణాల్ ఠాకూర్ వింత ఫుడ్ సీక్రెట్: ఐస్‌క్రీమ్ రైస్‌కు బానిసైన సీతారామం బ్యూటీ!
  • మృణాల్ ఠాకూర్ వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినే అలవాటు నెట్టింట వైరల్.
  • ఈ వింత ఫుడ్ కాంబినేషన్ ఓ స్నేహితుడిని చూసి మొదలైందని మృణాల్ వెల్లడించింది.
  • మొదట ప్రయోగంగా తిన్నా, ఇప్పుడు పూర్తిగా అడిక్ట్ అయిపోయానని ఆమె తెలిపింది.
  • ఆకలి వేసినప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా తింటానని మృణాల్ ఓపెన్‌గా చెప్పింది.

సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఆసక్తికరమే. తాజాగా నటి మృణాల్ ఠాకూర్ తన వింత ఫుడ్ కాంబినేషన్ ‘ఐస్‌క్రీమ్ రైస్’తో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినే ఈ అలవాటు ఎలా మొదలైంది, దానికి ఎంతలా అడిక్ట్ అయ్యిందో ఆమె స్వయంగా వెల్లడించింది.

మృణాల్ వింత ఫుడ్ కాంబినేషన్

Mrunal Food : ఇది సోషల్ మీడియా జమానా..ఇక్కడ కాస్త క్రేజీగా ఏ విషయం కనిపించినా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, వారి అలవాట్లకు సంబంధించిన విషయాలైతే నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ .ఈ క్రమంలోనేతాజాగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సరికొత్త ఫుడ్ కాంబినేషన్‌తో వార్తల్లో నిలిచింది. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత నానితో కలిసి ‘హాయ్ నాన్న’ (2023), విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’ (2024) డెకాయిట్ (2026) వంటి చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది.ఇక కేవలం సినిమాలే కాదండోయ్..సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడి యాక్టివిటీస్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి కూడా. అయితే ఇప్పుడు మృణాల్ షేర్ చేసిన ఒక క్రేజీ సీక్రెట్ చూసి ఫ్యాన్స్ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా?

ఐస్‌క్రీమ్ రైస్ అలవాటు ఎలా మొదలైంది?

సాధారణంగా మనకు నచ్చిన ఫుడ్ కాంబినేషన్స్ వేరే వాళ్లకు వింతగా అనిపించవచ్చు. బిర్యానీలో థమ్సప్ కలుపుకుని తాగేవాళ్లు, చపాతీని టీలో ముంచుకుని తినేవాళ్లను మనం చూస్తూనే ఉంటాం. కానీ మృణాల్ ఠాకూర్ కి అలవాటైన ఫుడ్ కాంబినేషన్ వింటే మాత్రం ఎవరైనా సరే ఒక్క నిమిషం షాక్ అవ్వాల్సిందే. ఆమెకు అత్యంత ఇష్టమైన ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా? వేడివేడి అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినడం! అవును, మీరు విన్నది నిజమే. వినడానికే చాలా వింతగా, అసలు ఊహించుకోవడానికే కాస్త కష్టంగా ఉన్న ఈ కాంబినేషన్‌ను మృణాల్ మాత్రం లొట్టలేసుకుంటూ తినేస్తుందట.

అసలు విషయం చెప్పేసిన మృణాల్

సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఐస్‌క్రీమ్ రైస్

ఇంతకీ ఈ వింత అలవాటు ఆమెకు ఎలా మొదలైందో కూడా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా పంచుకుంది. ఒకరోజు ఆమె స్నేహితుడు ఒకరు వేడి అన్నంలో ఐస్‌క్రీమ్ కలుపుకుని చాలా ఇష్టంగా తింటుండటం మృణాల్ గమనించింది. అసలు ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తితో, కేవలం ఒక ప్రయోగంగా ఆమె కూడా దాన్ని రుచి చూసింది. అంతే, మొదటి ముద్దకే ఆ టేస్ట్‌కు మృణాల్ ఫిదా అయిపోయింది. మొదట్లో సరదాగా ట్రై చేసినా, ఇప్పుడు మాత్రం ఆ కాంబినేషన్‌కు పూర్తిగా అడిక్ట్ అయిపోయానని, తనకు బాగా ఆకలి వేసినప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా అన్నంలో ఐస్‌క్రీమ్ వేసుకుని తినేస్తానని చాలా ఓపెన్‌గా చెప్పేసింది.

మొదట్లో వింతగా అనిపించిన ఈ ఫుడ్ కాంబినేషన్, ఇప్పుడు మృణాల్‌కు ఇష్టమైన అలవాటుగా మారింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె అభిమానులకు ఇది ఒక కొత్త వినోదాన్ని అందిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.