
📌 Key Points
- రామ్‌గోపాల్ వర్మ నేపాలీ ముఠాల ఆగడాలు, అంతర్జాతీయ లింకులపై సినిమా తీయనున్నట్లు వార్తలు.
- ప్రస్తుతం ఆర్జీవీ టీమ్ ఈ కాన్సెప్ట్‌పై లోతైన రీసెర్చ్ చేస్తోంది.
- గతంలో ‘సత్య’ సినిమా చూసి గొప్ప సినిమాలు తీస్తానని వర్మ ప్రతిజ్ఞ చేసినా, పాత పంథాలోనే ఉన్నారు.
- మాఫియా, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘సిండికేట్’ వంటి ప్రాజెక్ట్‌లను గతంలో అనౌన్స్ చేశారు.
రామ్‌గోపాల్ వర్మ రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసు, నేపాలీ ముఠాల ఆగడాలపై సినిమా తీయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌ను షేక్ చేస్తున్న ఈ సెన్సేషనల్ క్రైమ్ స్టోరీని తనదైన శైలిలో తెరకెక్కించేందుకు ఆర్జీవీ బృందం రీసెర్చ్ చేస్తోంది.
ఆర్జీవీకి నేపాలీ గ్యాంగ్స్ కథపై ఆసక్తి
RGV Movie: రామ్‌గోపాల్ వర్మ…సమాజంలో జరిగే సెన్సేషనల్ క్రైమ్స్, రియల్ లైఫ్ డ్రామాలను తనదైన శైలిలో స్క్రీన్ మీదకు తీసుకురావడంలో ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ‘పరిటాల రవి’ కథతో ‘రక్తచరిత్ర’ తీసినా, ఆ తర్వాత రాజకీయ పరిణామాల ఆధారంగా ‘రక్తచరిత్ర 2’, అలాగే చంద్రబాబు, ఎన్టీఆర్ లైఫ్స్ చుట్టూ తిరిగే వివాదాస్పద కథలను ఫిక్షనైజ్ చేసి థియేటర్లలోకి తెచ్చినా అది ఆర్జీవీకే చెల్లింది.
ఇప్పుడు హైదరాబాద్‌ను షేక్ చేస్తున్న నేపాలీ ముఠాల ఆగడాలు, వాళ్ల వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు వర్మను విపరీతంగా ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్‌కు సంబంధించి ఒక పక్కా స్క్రిప్ట్ పాయింట్ కోసం వర్మ అండ్ టీమ్ డీప్ గా రీసెర్చ్ చేస్తోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో వర్మ చేసిన ప్రతిజ్ఞ, ప్రస్తుత సినిమాలు
అయితే నేపాలీ గ్యాంగ్స్ స్టోరీలో ఆర్జీవీ మార్క్ రా సిఐడి తరహా ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. నమ్మకం, మోసం, పక్కా స్కెచ్, అర్ధరాత్రి హత్యలు.. ఇలాంటి డార్క్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లను హ్యాండిల్ చేయడంలో వర్మది ఒక ఒక ప్రత్యేకమైన స్టైల్. ఒకవేళ ఈ నేపాలీ ముఠాల కథనైనా వర్మ సీరియస్‌గా తీసుకుని, పాత ‘సత్య’ లేదా ‘శివ’ రేంజ్ మేకింగ్ వాల్యూస్‌తో స్క్రీన్‌పైకి తెస్తే బాక్సాఫీస్ దగ్గర మళ్లీ పాత ఆర్జీవీని చూసే అవకాశం ఉంటుంది. అనౌన్స్‌మెంట్లతోనే సరిపెట్టే వర్మ.. కనీసం ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీనైనా సెట్స్ పైకి తీసుకెళ్తాడా లేదా అనేది కాలమే డిసైడ్ చేయాలి. ఏదేమైనా ఈ క్రేజీ కాన్సెప్ట్‌తో వర్మ నుంచి సినిమా వస్తే మాత్రం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.
క్రైమ్ థ్రిల్లర్ కథలకు ఆర్జీవీ మార్క్
నేపాలీ గ్యాంగ్స్ కథలో నమ్మకం, మోసం, హత్యలు వంటి డార్క్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ కథను ఆర్జీవీ ఎలా తెరకెక్కిస్తారో, తన పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకుంటారో వేచి చూడాలి.


