
📌 Key Points
- కరుప్పు సినిమా ఎడిటర్ కలైవనన్ సూర్య అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
- తన ఇంటర్వ్యూ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
- కలైవనన్ పోస్ట్‌పై హీరో సూర్య ‘స్టే కైండ్, స్టే జనరస్’ అని స్పందించారు.
- సూర్య స్పందన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా ఎడిటర్ కలైవనన్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై హీరో సూర్య ‘స్టే కైండ్’ అంటూ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కరుప్పు ఎడిటర్ క్షమాపణలు ఎందుకు?
Hero Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా నటించిన చిత్రం కరప్పు.. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 15న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు పాజిటివ్ టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ను కూడా వసూల్ చేసింది. అయిన ఈ మూవీ పై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.. ఈ చిత్రం పై వస్తున్న ట్రోల్స్ పై చిత్ర ఎడిటర్ కలైవనన్ స్పందించారు. అంతేకాదు సూర్య ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్తూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో హీరో సూర్య దాని పై స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన అభిప్రాయాన్ని చెప్పారు.. అది కాస్త హాట్ టాపిక్ గా మారడంతో ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కరుప్పు.. ఈ మూవీలో హీరో, హీరోయిన్ సూర్య, త్రిష జంటగా నటించారు. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఒకవైపు ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర యూనిట్ఎక్కడ స్పందించినట్లు కనిపించలేదు.. సినిమా మంచి టాక్ ని అందుకున్నందుకు హీరో సూర్య సినిమాకు టెక్నీషియల్ గా పనిచేసిన వాళ్లకి ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన కలైవనన్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు. నేను ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలా నోరుజారి మాట్లాడను. నన్ను క్షమించండి అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తాజాగా ఈ పోస్ట్ పై హీరో సూర్య స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.
సూర్య ‘స్టే కైండ్’ మెసేజ్ వెనుక అర్థం
‘కరుప్పు’ ఎడిటర్ క్షమాపణలు చెబుతూ చేసిన పోస్ట్ పై హీరో సూర్య స్పందించారు.. ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. అందులో ‘stay kind, stay generous ‘ అని రాశారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. సూర్య గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పోస్ట్ చేయడంపై ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు.. ఇకపోతే కరుప్పు మూవీ తెలుగులో వీరభద్రుడు పేరుతో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్స్ కూడా వసూల్ అయ్యాయి.. ప్రస్తుతం సూర్య ఇప్పటికే తెలుగులో విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. చెన్నై వ్యాసార్పాడికి చెందిన డాక్టర్ తిరువేంగడం తెలుగువారికి కూడా సుపరిచితమే..ఆరేళ్ళ క్రితం ఆయన మరణించారు. ఇప్పుడు ఆ లెజండరీ వైద్యుడు బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. ఇందులో సూర్య నటిస్తున్నారు. దీంతో పాటుగా మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఓ సినిమా గురించి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వివాదం
Tags editor kalaivanan Hero surya social media post Share
మొత్తానికి, ‘కరుప్పు’ ఎడిటర్ క్షమాపణలు, సూర్య హుందాగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సెలబ్రిటీల ప్రతిస్పందనలు అభిమానులపై ఎంత ప్రభావం చూపుతాయో ఇది మరోసారి రుజువు చేసింది.


