|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chaurya Paatham OTT: ముందు అక్కడ.. ఇప్పుడు మన దగ్గర స్ట్రీమింగ్

Updated: 28-05-2025, 10:43 AM
Chaurya Paatham OTT: ముందు అక్కడ.. ఇప్పుడు మన దగ్గర స్ట్రీమింగ్

గత నెల థియేటర్లలో విడుదలైన తెలుగు చిత్రం ‘చౌర్యపాఠం’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇంద్ర‌రామ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో సాగుతుంది.

Key Points

1

ఇంద్ర‌రామ్, పాయల్ రాధాకృష్ణ నటించిన 'చౌర్యపాఠం' ఓటీటీలోకి

2

బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ కథ

4

ఈ వారం ఓటీటీలో విడుదలైన ఇతర ఆసక్తికర చిత్రాలతో పాటు 'చౌర్యపాఠం' కూడా అందుబాటులో ఉంది

చౌర్యపాఠం: కథానకం

గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.

డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా ‘చౌర్యపాఠం’. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.

ఓటీటీ విడుదల వివరాలు

చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. ‍బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.

ఇతర ఓటీటీ విడుదలలు

ఇకపోతే ఈ వారం దాదాపు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరమ్ లాంటి స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలతో పాటు ‘అజ్ఞాతవాసి’ అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి.  మూవీ లవర్స్‌కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లిస్టులోకే ‘చౌర్యపాఠం’ కూడా వచ్చి చేరింది.

చివరగా, ‘చౌర్యపాఠం’ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం విడుదలైన ఇతర సినిమాలతో పాటు దీనిని ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.