|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండియాలో పుట్టిన కళ చేతబడి.. డైరెక్టర్ కామెంట్స్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెలుగు హారర్ థ్రిల్లర్

Published: 31-07-2025, 9:15 AM
ఇండియాలో పుట్టిన కళ చేతబడి.. డైరెక్టర్ కామెంట్స్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెలుగు హారర్ థ్రిల్లర్

తెలుగు తెరకు రానున్న ‘చేతబడి’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా, 1953లో గిరిడ గ్రామంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా రూపొందింది. 16వ శతాబ్దంలో పుట్టిన చేతబడి కళను ఈ సినిమా ప్రధానంగా చూపుతుంది.

Key Points

1

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్.

2

16వ శతాబ్దపు చేతబడి కళను ప్రధానంగా చూపుతుంది.

4

1953 గిరిడ గ్రామంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా కథ.

చేతబడి: ఒక కళా రూపం

తెలుగులో ఎన్నో రకాల హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని హిట్ సాధిస్తే మరికొన్ని ఫ్లాప్‌గా మిగిలాయి. ఇప్పుడు తెలుగులో మరో న్యూ హారర్ థ్రిల్లర్ సినిమా రానుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కే ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు చేతబడిగా టైటిల్ పెట్టారు.

చేతబడి సినిమాను శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మాణంలో నూతన దర్శకుడు సూర్యాస్ తెరకెక్కిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. అంతేకాకుండా చేతబడి గురించి, మూవీ కథ గురించి డైరెక్టర్ సూర్యాస్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ

దర్శకుడు సూర్యాస్ మాట్లాడుతూ.. ” చేతబడి అనేది 16వ శతాబ్దంలో మన ఇండియాలో పుట్టిన ఒక కళ. రెండు దేశాలు కొట్టుకోవాలన్నా.. రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలం బలగంతో ఉండాలి. కానీ, ఒక ఈవిల్ ఎనర్జీతో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి” అని అన్నారు.

“చేతబడి ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన బాడీలో ప్రతి దానికి ఒక ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుంది” అని డైరెక్టర్ సూర్యాస్ తెలిపారు.

సినిమా ప్రత్యేకతలు

“1953 గిరిడ అనే గ్రామంలో రియల్‌గా జరిగిన యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా థిక్‌గా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్ల కోడిని పాతిపెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నాం” అని చేతబడి దర్శకుడు సూర్యాస్ వివరించారు.

అనంతరం నిర్మాత నంద కిషోర్ మాట్లాడుతూ.. “ఒకప్పుడు బాణామతి భయం వల్ల రాజకీయ , సామాజిక, మానసిక సమస్యలు తలెత్తాయి. ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకున్న వారి గురించి ఈ చేతబడి చిత్రంలో రియలిస్టిక్‌గా చూపించబోతున్నాం” అని పేర్కొన్నారు.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ‘చేతబడి’ సినిమా, ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేయడం ఖాయం. ఈ సినిమా హారర్ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.