
📌 Key Points
- చికెన్ ధరలు కిలోకు రూ.100 పైగా తగ్గింపు
- హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.265-270కి చేరిక
- వాతావరణ మార్పులే ధరల తగ్గుదలకు కారణం
- గతంలో చికెన్ ధరలు రూ.400కు చేరాయి
గత కొంతకాలంగా మండిపోతున్న చికెన్ ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో మాంసం ప్రియులకు ఆనందం కలుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ఈ ధరల తగ్గుదలకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ ధరలు ఎందుకు తగ్గాయి?
గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు బెంబేలెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలికింది. దీంతో చికెన్ కొనాలంటేనే…వణికిపోయారు. చికెన్ బదులు మటన్ కొనేందుకు ఆసక్తి చూపారు. అయితే మళ్లీ చికెన్ షాపులు సందడిగా మారిపోయాయి. కారణం ఒక్కసారిగా ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ప్రియులు…. క్యూలు కడుతున్నారు.
కేజీ చికెన్ రూ. 380 వరకు పలకగా… తాజాగా వంద రూపాయలకు పైగా ధర తగింది. దీంతో మళ్లీ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర (స్కిన్ లెస్) రూ.265 నుంచి 270 పలుకుతుంది. అటు జిల్లాల్లోనూ చికెన్ ధరలు భారీగా దిగివచ్చాయి. స్కిన్ తో అయితే చికెన్ రూ.235 నుంచి రూ.240 వరకు పలుకుతుంది.
ఇక ఏపీలో చూస్తే కిలో చికెన్ రూ.300 నుంచి 350 మధ్య పలుకుతోంది. ఒక్కసారిగా చికెన్ ధరలు తగ్గిపోవటంతో…. మాంసం ప్రియులు మళ్లీ షాపులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
హైదరాబాద్‌లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా చికెన్ ధరల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లబడటంతో చికెన్ ధరలు తగ్గాయని చెబుతున్నారు.
పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. వేసవి కావటంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ కాలంలో కోళ్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటి కారణాలతో మార్కెట్‌లో చికెన్ ధరలు ఎక్కువ తక్కువ అవుతూనే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
మాంసం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తేనా?
సాధారణంగా కిలో చికెన్ ధర రూ.170 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. శ్రావణ, కార్తీక మాసాలలో ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ గత రెండు నెలల్లో ఏకంగా కిలో రూ.400 ఆల్ టైం రికార్డు ధర పలికింది. ప్రస్తుతం చికెన్ ధరలు భారీగా దిగిరావడంతో మాంసం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
చికెన్ ధరలు తగ్గడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది మాంసం ప్రియులకు నిజంగా ఊరటనిచ్చే విషయం.


