
📌 Key Points
- చిరంజీవి సినిమాలో ఖుషి నటన అద్భుతం.. ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టింది!
- రియల్ లైఫ్‌లో తండ్రి లేని ఖుషి.. చిరుని నాన్న అని పిలిచి కన్నీళ్లు పెట్టుకుంది!
- చిరంజీవి కూతురిగా నటించడం నా అదృష్టం, మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా – ఖుషి
- చిరంజీవి మంచి మనసున్న వ్యక్తి.. ఖుషికి కేక్స్, చాక్లెట్స్ ఇచ్చి సంతోషపరిచారు!
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె రియల్ లైఫ్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
చిరంజీవి కూతురిగా ఖుషి ఎమోషనల్ కామెంట్స్!
Child Artist Khushi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. ఈ సినిమాలో చిరంజీవి ఇద్దరి పిల్లల తండ్రిగా నటించారు. చిరంజీవి కూతురిగా ఖుషి సోని అనే పాప నటించగా చిరంజీవి కొడుకుగా ఊహ అనే పాప నటించింది. ఈ ఇద్దరూ కూడా చిరంజీవి, నయనతార.. మిగతా ఆర్టిస్టులతో బాగా నటించి మెప్పించారు.(Child Artist Khushi)
ఖుషి సినిమాలో ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పించింది. సినిమా సక్సెస్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలు తనకు నాన్న లేరని, చిరంజీవిని నాన్న అని పిలిచినప్పుడు ఎమోషనల్ అయినట్టు ఆ విషయాలు చెప్పుకొచ్చింది.
రియల్ లైఫ్‌లో తండ్రి లేని ఖుషి విషాదం!
చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి మాట్లాడుతూ.. నాకు నాన్న లేరు. మాది రాజస్థాన్. రెండేళ్ల క్రితం హైదరాబాద్ కి వచ్చాము. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు. మా ఇద్దర్ని మా అమ్మే చూసుకుంటుంది. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ కూడా నేను చదివే స్కూల్ లోనే పనిచేస్తుంది. చిరంజీవి కూతురిగా నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ లో చిరంజీవిని నాన్న అని పిలిచినప్పుడు ఒక్కోసారి ఎమోషనల్ అయ్యేదాన్ని. ఏడుపు కూడా వచ్చేది. నాకు కూడా అలాంటి నాన్న ఉంటే బాగుండేది అనిపిస్తుంది. చిరు సర్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మాకు కేక్స్, చాక్లెట్స్ ఇచ్చారు. చిరంజీవితో ఇంకోసారి నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా అని తెలిపింది.
ఖుషికి చిరంజీవి ఇచ్చిన సపోర్ట్ చూస్తే షాక్ అవుతారు!
అయితే తన తండ్రి లేరు అని చెప్పింది కానీ అంతకుమించి ఎలాంటి వివరాలు తన తండ్రి గురించి చెప్పడానికి ఇష్టపడలేదు ఖుషి. దీంతో పాపం అని అంటున్నారు నెటిజన్లు. రియల్ లైఫ్ లో తండ్రి లేకపోయినా సినిమాలో తండ్రి కూతురు బాండింగ్ ని చాలా బాగా పండించింది, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది అని ఖుషిని అభినందిస్తున్నారు.
చిరంజీవి గారి సినిమాలో ఖుషి నటన గురించి, ఆమె జీవితంలోని విషాదం గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


