|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దేవరకొండ అన్నా, రౌడీ ష‌ర్ట్స్ రెడీగా పెట్టుకో..చైల్డ్ ఆర్టిస్ట్ అరాచ‌కం !

Published: 06-11-2025, 10:02 AM
దేవరకొండ అన్నా, రౌడీ ష‌ర్ట్స్ రెడీగా పెట్టుకో..చైల్డ్ ఆర్టిస్ట్ అరాచ‌కం !

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ప్రీమియర్ షోలు విజయవంతంగా ప్రదర్శితమయ్యాయి. ఈ సందర్భంగా చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ తమ చిత్ర బృందానికి రౌడీ షర్ట్స్ సిద్ధం చేయాలని కోరడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Key Points

1

తిరువీర్ రెడ్డి, టీనా శ్రావ్య నటించిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రం ప్రీమియర్ షోలు విజయవంతం.

2

సినిమా బంపర్ హిట్ కొట్టడం ఖాయమని చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ ధీమా వ్యక్తం చేశాడు.

4

గతంలో 'లిటిల్ హార్ట్స్' సినిమా బృందానికి దేవరకొండ షర్ట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’పై భారీ అంచనాలు

దిశ‌, వెబ్ డెస్క్‌: తిరువీర్ రెడ్డి, టీనా శ్రావ్య కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ( The Great Pre-Wedding Show). చిన్న సినిమాగా వచ్చిన దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అగరం సందీప్ నిర్మాణంలో, రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా సోమశేఖర్ సినిమాటోగ్రాఫర్. శ్రీకాకుళం దగ్గరలో ఉన్న ఓ ఊరిలో ప్రీ వెడ్డింగ్ షో , ఫోటో స్టూడియో న‌డిపే వ్య‌క్తి చుట్టూ జ‌రిగే సంఘ‌ట‌న‌ను సినిమాగా తీశారు. ఈ సినిమాలో మొత్తం కామెడీనే ఉంటుంద‌ట‌.

అయితే మూవీ ప్రీమియ‌ర్ షోలు ఇవాళే ప‌డిపోయాయి. దీంతో పాజిటివ్ టాక్ వ‌స్తోంద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. రివ్యూలు కూడా బాగానే వ‌స్తున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సినిమాలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహ‌న్ రాయ్ ( Child Artist Rohan Roy) చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా బాగుంద‌ని వెల్ల‌డించాడు. బంప‌ర్ హిట్ కొట్ట‌డం గ్యారెంటీ అంటూ వ్యాఖ్యానించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండన్న మా చిత్ర బృందానికి కూడా రౌడీ ష‌ర్ట్స్ రెడీ చేసుకో, నా సైజ్ స్మాల్‌…అంద‌రిదీ తెలీదు.. వెంటనే ష‌ర్ట్స్ సిద్ధం చేసుకో అంటూ పేర్కొన్నాడు. మా సినిమా కూడా చూడండి అంటూ తెలిపాడు. దీంతో రోహ‌న్ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. కాగా లిటిల్ హార్ట్స్ సినిమా బృందానికి కూడా దేవ‌ర‌కొండ ష‌ర్ట్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. క్లిక్

చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ వైరల్ కామెంట్స్

విజయ్ దేవరకొండకు రోహన్ రాయ్ విన్నపం

మొత్తంగా, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రానికి రోహన్ రాయ్ వ్యాఖ్యలు మరింత ప్రచారం తెచ్చాయి. విజయ్ దేవరకొండ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ చిన్నారి ధైర్యం అందరినీ ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.