|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బైడూ.. వార్ గేమ్ చేంజర్

Published: 03-03-2026, 6:35 AM
బైడూ.. వార్ గేమ్ చేంజర్
  • ఇరాన్ యుద్ధ వ్యూహాలను అమెరికా తెలుసుకోవడం కష్టంగా మారింది.
  • చైనా నావిగేషన్ టెక్నాలజీ బైడూను ఇరాన్ ఉపయోగించడం అమెరికాకు నష్టం కలిగిస్తోంది.
  • అమెరికా ఒక రోజు యుద్ధ ఖర్చు సుమారు 7 వేల కోట్లుగా ఉంది.
  • చైనా యొక్క బైడూ నావిగేషన్ వ్యవస్థ అమెరికా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.

ఇరాన్ యుద్ధంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చైనా యొక్క బైడూ నావిగేషన్ వ్యవస్థ ఇరాన్ కు సహాయం చేయడం ద్వారా అమెరికాకు సవాలు విసురుతోంది. దీని ద్వారా అమెరికా యొక్క యుద్ధ వ్యూహాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

బైడూతో అమెరికాకు షాక్!

ఇరాన్ యుద్ధం విషయంలో మారుతున్న పరిణామాలు సైనిక నిపుణులనే కాదు.. ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇరాన్ పని అయిపోయిందన్న చాలామంది.. ఇప్పుడు అభిప్రాయాలను మార్చుకోక తప్పని పరిస్థితి అయ్యింది. మరోవైపు చైనా యుద్ధంలోకి దిగుతుందని వార్తలు వస్తున్నాయి.. కానీ, చైనా ఎప్పుడో యుద్ధంలోకి వచ్చేసింది.. అయితే, అది పరోక్షంగా. ఇరాన్ కు ఉన్న అతి పెద్ద అడ్డంకి జీపీఎస్ టెక్నాలజీ. మిస్సైళ్లు ప్రయోగించాలన్న, మోహరించాలన్నా, ఎయిర్ డిఫెన్స్ రెడీ చేయాలన్నా ముందుగా జీపీఎస్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. జీపీఎస్ అమెరికాకి చెందినది కావడంతో ఇరాన్ ఏ అడుగు వేయాలన్నా, అమెరికాకి తెలిసిపోయేది. కానీ, ఇప్పుడు చైనాకి చెందిన బైడూ నావిగేషన్ టెక్నాలజీ వాడుతుండటంతో అమెరికాకి ఇరాన్ యుద్ధ తంత్రం ఏమిటో అర్థం కావడం లేదు. దూసుకువస్తున్న వందలకొద్ది డ్రోన్లు అందులో దాగి ఉన్న క్షిపణులను తెలుసుకోవడం కష్టంగా మారింది. పైగా 20వేల డాలర్ల డ్రోన్ ని కూల్చేందుకు 20 లక్షల డాలర్ల మిస్సైళ్లను వాడాల్సి వస్తున్నది. ఇది అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. ఒక అంచనా ప్రకారం ఒక్కరోజే అమెరికా యుద్ధం ఖర్చు 7వేల కోట్లు.. ఈ లెక్కన చూస్తే ఇరాన్ ఓడిపోయిందా? అమెరికానా? అన్న ప్రశ్న ఉదయించకమానదు. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు యుద్ధంలో గేమ్ చేంజర్ లా చైనా నావిగేషన్ వ్యవస్థ బైడూ నిలిచింది. ఆ వ్యవస్థ ప్రత్యేకతలు అమెరికా దానిని ఎందుకు నిలువరించలేకపోతున్నదో తెలుసుకుందాం.

మల్టీ-ఆర్బిట్ నెట్‌వర్క్ (త్రిస్థాయి రక్షణ)

నావిగేషన్ శాటిలైట్లు మూడు స్థాయుల్లో ఉంటాయి. అంటే భూమికి ఎంత ఎత్తులో ఉంటాయి.. దీంతోపాటు అవి భూమికి స్థిరమైన కక్ష్యలో ఉంటాయా? లేదా? అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా జియో, ఇగ్సో, మియో అంటే ఏమిటో తెలుసుకోవాలి.

Geostationary Orbit: GEO (జియో)

యుద్ధంలో బైడూ పాత్ర

ఇది భూమికి 35వేల కిలోమీటర్లపై స్థిరంగా ఉంటాయి. ఇవి అంత ఎత్తుకు వెళ్లడం పైగా భూస్థిర కక్ష్యలో ఉండటంతో అవి భూమిపైనుండే ఒక ప్రాంతాన్ని మాత్రమే అంటే పశ్చిమాసియా దాదాపు 15వేలనుంచి 17వేల కిలోమీటర్ల పరిధిని ఇది కవర్ చేస్తుంది. అక్కడ చిన్నపాటి వస్తువును కూడా క్లియర్ గా చూపిస్తుంది. నిజానికి భూమిని మొత్తం కవర్ చేయడానికి ఈ శాటిలైట్లు మూడు ఉంటే సరిపోతుంది. కానీ, చైనా ఐదింటిని ప్రయోగించింది.

Inclined Geo-Synchronous Orbit: IGSO (ఇగ్సో)

ఇదికూడా భూమికి 35వేల కిలోమీటర్లపై ఉంటుంది. కానీ, భూ స్థిర కక్ష్యలో కాకుండా వాలుగా ఉండే భూమి సమకాలీన కక్ష్యలో ఉంటాయి. అయితే ఇది స్థిర కక్ష్యలో ఉండదు కాబట్టి భూమి చుట్టూ 8 ఆకారంలో తిరుగుతుంటుంది. అంటే నిర్దిష్ట లక్ష్యంపై మాత్రమే నిఘా పెడతాయి. ఇది కూడా 15వేల కిలోమీటర్ల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. చైనా ఈ శాటిలైట్లను మూడింటిని ఉపయోగిస్తున్నది.

అమెరికాపై ఆర్థిక భారం

Medium Earth Orbit: MEO (మియో)

ఇది భూమికి 2వేల నుంచి 20వేల కిలోమీటర్లపైన అంటే మధ్యస్థ భూ కక్ష్యలో ఉంటాయి. ఇవి స్థిరంగా ఉండవు. తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కువ ఉంటేనే దీనితో నిఘా పెట్టడం సాధ్యం అవుతుంది. ఇవి 8వేలనుంచి 10వేల కిలోమీటర్లు కవర్ చేస్తాయి. ఈ శాటిలైట్లను అమెరికా 31వాడితే, చైనా వద్ద 27 ఉన్నాయి. భూమిపై ఉన్న ఒక్క అంగుళాన్ని ఎల్లప్పుడు కనీసం నాలుగు వైపులా శాటిలైట్లు కవర్ చేసేందుకే అగ్రరాజ్యాలు ఇన్ని శాటిలైట్లను ప్రయోగించాయి.

అమెరికా ప్రధానంగా ఆధారపడే జీపీఎస్ కేవలం ఒకే రకమైన కక్ష్యలో (MEO) తిరిగే శాటిలైట్లపై ఆధారపడుతుంది. కానీ బైడూ మూడు రకాల కక్ష్యల్లో (GEO, IGSO, MEO) ఉంటుంది. ముఖ్యంగా జియో శాటిలైట్లు భూమికి ఒకే చోట స్థిరంగా ఉండటం వల్ల, ఆ ప్రాంతంలో (పశ్చిమాసియా వంటి చోట్ల) సిగ్నల్ బలం చాలా ఎక్కువగా ఉంటుంది. బైడూ ఉపయోగించే సీడీఎంఏ టెక్నాలజీ, దాని సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బలం జీపీఎస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది దట్టమైన అడవులు, కొండలు మరియు పట్టణాల్లోని భవనాల మధ్య కూడా చొచ్చుకుపోగలదు. 2017లో చైనా-అమెరికా ‘ఇంటర్ ఆపరేబిలిటీ’ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం బైడూ, జీపీఎస్ కొన్ని ఫ్రీక్వెన్సీలను పంచుకుంటాయి. ఒకవేళ అమెరికా బైడూ సిగ్నల్స్‌ను పూర్తిగా జామ్ చేస్తే, ఆ ప్రభావం అమెరికా సొంత జీపీఎస్ వ్యవస్థపై కూడా పడే ప్రమాదం ఉంది. అందుకే బైడూ విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది.

మొత్తానికి, చైనా యొక్క బైడూ నావిగేషన్ వ్యవస్థ అమెరికా ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇది ప్రపంచ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.