
గాయని చిన్మయి తన సంచలన పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై 24 రోజులుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆమె మండిపడింది. ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్న సంధించి, సోషల్ మీడియాలో దుమారం రేపింది.
Key Points
గాయని చిన్మయి సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో దుమారం రేపుతోంది.
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైలులో బాలికను వేధించిన శశి భూషణ్ ఉపాధ్యాయను 24 రోజులుగా అరెస్టు చేయకపోవడాన్ని ప్రశ్నించింది.
ప్రభావాన్ని ఉపయోగించి పోలీసులను ఒత్తిడి చేయని ట్విట్టర్ గ్రూపుల తీరును చిన్మయి ఎత్తి చూపింది.
చిన్మయి వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు
నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) భార్య సింగర్ చిన్మయి(Chinmayi)ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు సాంగ్స్ పాడిన ఆమె స్టార్ హీరోయిన్‌కు డబ్బింగ్ చెప్పి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఈనేపథ్యంలోనే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తమిళనాడులో చిన్మయిని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పూర్తిగా పాటకు దూరం అయింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో దుమారం రేపుతోంది. అలాగే కొంతమందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అమ్మాయిలకు అన్యాయం చేసిన వారిని ఓ ఆట ఆడేసుకుంటుంది. దేశంలోని జరిగే సంఘటన గురించి తనదైన స్టైల్లో పోస్టులు పెడుతూ ఆలోచింపచేస్తుంది.
లైంగిక వేధింపుల ఘటనపై చిన్మయి ఆగ్రహం
కానీ కొందరు చిన్మయిపై విమర్శలు చేసినప్పటికీ భయపడకుండా.. తనకు నచ్చింది చెప్తోంది. అంతేకాకుండా తనను మాటలన్న వారికి మాత్రం స్ట్రాంగ్‌గానే ఇచ్చిపడేస్తుంది. గత కొద్ది కాలంగా ఆమె జాని మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతోంది. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పని గురించి చెప్తూ.. కొంతమంది ట్విట్టర్ యూజర్లను ప్రశ్నించింది. ‘‘24 రోజుల క్రితం శశి భూషణ్ ఉపాధ్యాయ రైలులో ఒక బాలికను లైంగికంగా వేధిస్తున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.
శశి భూషణ్ ఉపాధ్యాయ కేసు: చిన్మయి ప్రశ్నలు
పోలీసులకు సమాచారం అందింది. అయినప్పటికీ ఈ వ్యక్తిని అరెస్టు చేయలేదు. వేరే విధంగా కోపంతో రగిలిపోయి, అభిప్రాయం కోసం ప్రజలను వేధించే ట్విట్టర్ గ్రూపులు ఆ పలుకుబడిని ఉపయోగించి పోలీసులను స్వయంగా తీసుకెళ్లి కేసు తీసుకోవాలని ఒత్తిడి చేయట్లేరు ఎందుకని. చెప్పాల్సినవన్నీ చెబుతారు కానీ ముఖ్యమైనవి విషయాల్లో సైలెంట్‌గా ఉంటారు. 24 రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇదెక్కడి న్యాయం’’ అని రాసుకొచ్చింది. ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
చిన్మయి లేవనెత్తిన ఈ ప్రశ్న సమాజంలో న్యాయం పట్ల ఉన్న లోపాలను ఎత్తిచూపుతోంది. సామాజిక మాధ్యమాలలో ఆమె పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది, నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


