
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని, గీతా ఆర్ట్స్ ఒక స్పెషల్ మ్యాషప్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా, ప్రభాస్-గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుందనే ఊహాగానాలకు తెరలేపింది. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Key Points
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు.
గీతా ఆర్ట్స్ ప్రభాస్‌కు ప్రత్యేక మ్యాషప్ వీడియోను విడుదల చేసింది.
గీతా ఆర్ట్స్ తో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఊహాగానాలు.
ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, హనురాగవపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు.
గీతా ఆర్ట్స్ నుండి ప్రభాస్‌కు స్పెషల్ బర్త్ డే వీడియో
దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, స్టార్స్ ఆయనకు సోషల్ మీడియా వేధికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సైతం ప్రభాస్‌కు మ్యాష్ అప్ వీడియోతో సర్ప్రైజ్ ఇచ్చింది. వీడియోలో ప్రభాస్ చేసిన సినిమాల క్లిప్స్ యాడ్ చేసి బ్యాగ్రౌండ్‌లో అదిరిపోయే డైలాగ్స్ యాడ్ చేసింది. అర్జునుడి లాంటి రూపం.. భీముడి లాంటి బలం అంటూ సాగే వీడియో చూడ్డానికి ఎంతో ఆకట్టుకునే విధంగా పవర్ ఫుల్‌గా ఉంది.
దీంతో వీడియో చూసిన అభిమానులు కుషీ అవుతున్నారు. అంతే కాకుండా గీత ఆర్ట్స్ స్పెషల్ వీడియోను విడుదల చేసింది అంటే ప్రభాస్ తో ఏదైనా ప్రాజెక్ట్ కన్ఫామ్ అయ్యిందా అని అనుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బర్త్ డే బాయ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు సలార్ 2, ప్రభాస్ హనురాగవపూడి కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పై ఉన్నాయి. VIDEO
కొత్త ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు, అభిమానుల ఆనందం
ప్రభాస్ రాబోయే చిత్రాల వివరాలు
మొత్తంగా, ప్రభాస్ బర్త్ డే సందర్భంగా గీతా ఆర్ట్స్ విడుదల చేసిన వీడియో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. కొత్త ప్రాజెక్ట్ గురించిన అంచనాలతో పాటు, ప్రభాస్ రాబోయే సినిమాలు కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


