
📌 Key Points
- ‘పెద్ది’కి అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు యాడ్.
- రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతి బాబు మధ్య కీలక సన్నివేశాలు చేరిక.
- రూ.400 కోట్ల క్లబ్‌లో చేరిన ‘పెద్ది’కి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం.
- మెగా ఫ్యాన్స్ కోసం టికెట్ రేట్ల తగ్గింపు, రిపీట్ ఆడియన్స్ టార్గెట్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ సినిమాకు ఊహించని మాస్ అప్డేట్ వచ్చింది! థియేటర్లలోకి అదనంగా 6 నిమిషాల నిడివి గల కొత్త సీన్లు యాడ్ అయ్యాయి. ఈ సంచలన వార్త మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. అసలు ఈ సీన్ల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి?
‘పెద్ది’లో కొత్త మసాలా: 6 నిమిషాల అదనపు సీన్లు!
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమాకి కొత్త సీన్లు యాడ్ చేస్తున్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ వెర్షన్ లో కంటే ముందు, థియేటర్లలోనే ఆ సన్నివేశాలను జోడిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పారు. బుధవారం యాడ్ చేస్తామని చెప్పారు కానీ.. ఇవాళ గురువారం మార్నింగ్ షోల నుంచి కొత్త సీన్స్ కలిపారు. అదే సమయంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారని తెలుస్తోంది. ‘పెద్ది’ సినిమాలో కొత్తగా 5 నిమిషాల 56 సెకెన్ల నిడివి ఉన్న సన్నివేశాలను యాడ్ చేశారు. రామ్ చరణ్ – జాన్వీ కపూర్ మధ్య వచ్చే రెండు సన్నివేశాలతో పాటుగా జగపతిబాబు-చరణ్ మధ్య వచ్చే సీన్ జోడించారు. ఇప్పటికే జాన్వీ పాత్రకి సంబంధించి కొన్ని కెమెరా యాంగిల్స్ ను కట్ చేయగా.. ఇప్పుడు శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొన్నింటిని ట్రిమ్ చేశారు. ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పలు భారతీయ భాషల్లో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ తో కలుపుకొని రెండు వారాల్లో రూ.400 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు కొత్త సన్నివేశాలు యాడ్ చేయడం వల్ల, ఈ వీకెండ్ లో రిపీట్ ఆడియన్స్ వస్తారని చిత్ర బృందం భావిస్తోంది. కాకపోతే ఈ స్ట్రాటజీ సినిమాకి ఏ మేరకు కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ‘పెద్ది’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ సోమవారం నుంచి ఆక్యుపెన్సీ బాగా తగ్గిపోయింది. నార్త్ తో పాటుగా కేరళ, తమిళనాడులో థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. హిందీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఇక ఓవర్ సీస్ లో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు కొత్త సీన్స్ యాడ్ చేయడం వల్ల కొత్త ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చు. కానీ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ మరోసారి సినిమాను చూసే అవకాశం ఉంది. టికెట్ రేట్లు ఎలాగూ తగ్గించారు కాబట్టి, మళ్లీ ఒకసారి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపించొచ్చు. రూ.400 కోట్ల క్లబ్‌లోకి ‘పెద్ది’.. ‘మస్సా మస్సా’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కాకపోతే ‘పెద్ది’ సినిమాలో కొత్తగా యాడ్ చేసిన సన్నివేశాలను కొందరు ఔత్సాహిక అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కాబట్టి కొత్త సీన్స్ కలపడం వల్ల భారీ స్థాయిలో కలెక్షన్స్ పెరుగుతాయని అనుకోలేం. దీనికి తోడు ఈ వారం ఐదు కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిల్లో సమంత ‘మా ఇంటి బంగారం’, వడ్డే నవీన్ ‘ట్రాన్సఫర్ త్రిమూర్తులు’తో పాటుగా విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’, ‘బాలన్: ది బాయ్’ వంటి డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. మరి వీటన్నిటినీ దాటుకొని, మూడో వారాంతంలో ‘పెద్ది’ ఏ మేరకు జనాలను రప్పిస్తుందో చూడాలి.
మెగా ఫ్యాన్స్‌కు పండగే: మళ్ళీ థియేటర్లకు!
కలెక్షన్లపై కొత్త సీన్ల ప్రభావం ఎంత?
‘పెద్ది’కి అదనపు సీన్ల జోడింపుతో థియేటర్లలో కొత్త ఉత్సాహం నెలకొంది. మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగే! ఈ ఊహించని ట్విస్ట్ సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్‌ల కోసం వేచి ఉండండి!


