|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్‌లోకి కామన్‌ మ్యాన్‌, గత సీజన్‌ నుంచి గుణపాఠం.. `నవరత్నాలు` హైలైట్‌గా సంచలన మార్పులు

Published: 29-06-2025, 5:18 AM
బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్‌లోకి కామన్‌ మ్యాన్‌, గత సీజన్‌ నుంచి గుణపాఠం.. `నవరత్నాలు` హైలైట్‌గా సంచలన మార్పులు

బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. గత సీజన్ ఆశించినంత విజయవంతం కాలేదు కాబట్టి, ఈ సారి కామన్ మ్యాన్ పాత్రతో పాటు నవరత్నాలు లాంటి కొత్త అంశాలతో ఆకట్టుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Key Points

కామన్ మ్యాన్ ఎంట్రీ

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి సమయం ఆసన్నమైంది. మరో రెండు నెలల్లో ఈ షోని ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. గత సీజన్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు.

ట్విస్ట్ లు, టర్న్ లు అన్నారు. మధ్యలో భారీగా వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్లని దించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభంతో పోల్చితే బెటర్‌గానే ఉన్నా, వాళ్లు ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రాలేదు. ఆడియెన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.

దీంతో ఇప్పుడు `బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పలు మార్పులు చేస్తున్నారట. ట్విస్ట్ లు, టర్న్ లు ఊహించని విధంగా భారీగా ప్లాన్‌ చేస్తున్నారట.

అందులో భాగంగా ఈ సీజన్‌లో మరోసారి కామన్‌ మ్యాన్‌ని దించబోతున్నారు. `బిగ్‌ బాస్‌ తెలుగు 7`వ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌ ఫ్యాక్టర్‌ బాగా పనిచేసింది. పల్లవి ప్రశాంత్ కామన్‌ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

రైతు బిడ్డ అంటూ రచ్చ చేశాడు. తగ్గేదెలే అంటూ ఆయన అందరిని ఆకట్టుకున్నారు. మాస్‌ గా గేమ్‌ ఆడుతూ రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా సీజన్‌ విన్నర్‌గా నిలిచాడు.

ఆ సీజన్‌ కి టీఆర్‌పీ రేటింగ్‌ కూడా బాగా వచ్చింది. అది ఎనిమిదవ సీజన్‌లో లైట్‌ తీసుకున్నారు. ఆ ఎఫెక్ట్ కనిపించింది. పెద్దగా రేటింగ్‌ రాలేదు. దీంతో ఆ గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకున్నారట.

గత సీజన్ పాఠాలు

అందుకే ఇప్పుడు `బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌ని తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక ప్రోమోని విడుదల చేశారు.  ఇందులో కామన్‌ మ్యాన్‌కి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వచ్చే అవకాశాన్ని కల్పించారు.

బిగ్‌ బాస్‌ షోపై ఇంత ప్రేమని చూపిస్తున్న మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమివ్వాలి, బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాన్ని ఇస్తున్నామని తెలిపారు. ఎలా రావాలి? ఎలా అప్లై చేసుకోవాలో ప్రోమోలో నాగ్‌ తెలిపారు.

ఏడో సీజన్‌ మాదిరిగానే ఈ సారి కామన్‌ మ్యాన్‌ ఫ్యాక్టర్‌ని బాగా వర్కౌట్‌ చేయాలనుకుంటున్నారట. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. కామన్‌ మ్యాన్స్ లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. మరి ఈ సారి కామన్‌ మ్యాన్‌ ఛాన్స్ ఎవరికి వరిస్తుందో చూడాలి.

#Biggboss9 is OPEN for everyone! 💥 Ee sari, meeru kuda Bigg Boss house lo Housemate avvachu! 🔥 👉 Apply now: https://t.co/2AEDJFmynT 📸 Register, upload your video, and get ready to enter the game! #BiggBossSeason9ComingSoon #BiggBossTelugu #BiggBossTelugu9 #ApplyNow #StarMaa pic.twitter.com/zGeKQEypme

— Starmaa (@StarMaa) June 29, 2025

సంచలన మార్పులు

ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేస్తున్నారట. బిగ్‌ బాస్‌ షో లాంచింగ్‌ రోజు 18 మంది కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపించబోతున్నారట.

అందులో 9 మంది అబ్బాయిలు, 9 మంది అమ్మాయిలు ఉంటారని సమాచారం. తొమ్మిది జంటలుగా వీరిని పంపిస్తారట. వీరికి `నవరత్నాలు` అనే పేరు పెట్టబోతున్నారట.

వీరిలో పేరున్న సెలబ్రిటీలు, వివాదాస్పద కంటెస్టెంట్లని, కామన్‌ మ్యాన్‌ ఉంటారని సమాచారం. ఈ సారి షో వేరే లెవల్‌లో ఉంటుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజమనేది చూడాలి.

ఇప్పటి వరకు బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించి వినిపిస్తున్న పేర్ల ప్రకారం అలేఖ్య చిట్టి అమ్మాయి రమ్య కంచర్ల, కల్పిక గణేష్‌, రాజ్‌ తరుణ్‌, సుమంత్‌ అశ్విన్‌, సాయి కిరణ్‌, ఛత్రపతి శేఖర్‌, కావ్య, దేబ్‌జాని, దీపికా, రీతూ చౌదరీ, తేజస్విని, శివ కుమార్‌, ఇమ్మాన్యుయెల్‌ రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

వీరితోపాటు మరికొందరి పేర్లు కూడా వినిపించాయి. ప్రస్తుతం కంటెస్టెంట్ల సెలెక్షన్‌ ప్రాసెస్‌ జరుగుతుందని సమాచారం. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే ఈ షోని సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారు.

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ లో కామన్ మ్యాన్ ప్రవేశంతో, గత సీజన్ల నుండి నేర్చుకున్న పాఠాలతో కొత్త ఆకర్షణీయ అంశాలతో రేటింగ్స్ పెంచుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.