|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘వీళ్లంతా ఎప్పుడు చస్తరో’.. ప్రముఖ సింగర్ చిన్మయి షాకింగ్ పోస్ట్…

Published: 22-06-2025, 6:13 AM

ఏపీలో 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

ప్రముఖ గాయని చిన్మయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

2

15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు.

3

రేపిస్టులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

4

ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు.

చిన్మయి ఆవేదన

ప్రముఖ సింగర్ చిన్మయి కెరీర్‌లో ఎన్నో ఫేస్ చేసింది. వైర ముత్తు లాంటి వ్యక్తులపై మీ టూ అలిగేషన్స్ చేసి తమిళ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయింది. కానీ తన పోరాటం మాత్రం ఆపలేదు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. నా పోరాటం ఆగదని స్పష్టం చేస్తూనే ఉంది. సింగిల్ పేరెంట్ చేతుల్లో పెరిగిన ఆమె ఇలాంటి ఎన్నో కష్టాలను ఎదుర్కోగా.. ఇతరులకు ఇలాంటి ఇబ్బందులొచ్చినా తన పూర్తి మద్దతు అందిస్తుంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో 15ఏళ్ల మైనర్ బాలికపై రెండేళ్లుగా 14 మంది గ్యాంగ్ రేప్ జరుగుతుందన్న వార్తపై ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వెధవలు ఎందుకు పుట్టారో తెలియదు కానీ ఎప్పుడు చస్తరో అంటూ పోస్టు పెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. ‘నేను ఈ విషయాన్ని భరించలేకపోతున్నా. ఆంధ్రలో 14 మంది రెండేళ్లుగా ఓ 15ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నరు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు.. అబ్బాయిలో డేంజర్‌లో ఉన్నట్లా? ఈ రేపిస్టులను కాల్చి బూడిదగా మార్చేయాలి. గ్యాంగ్ రేప్ న్యూ కల్చర్ అయిపోయింది. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్లందరు ఎప్పుడు చస్తరో’ అంటూ పోస్ట్ పెట్టింది.

గ్యాంగ్ రేప్ ఘటన

కఠిన శిక్ష అవసరం

చిన్మయి వంటి ప్రముఖులు ఇలాంటి ఘటనలపై స్పందించడం అవసరం. బాలికల రక్షణకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి. న్యాయం జరగాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.