|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘బీఫ్ తినేవాడు రాముడిగా నటిస్తున్నాడు’.. అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చిన్మయి సెన్సేషనల్ ట్వీట్

Published: 07-07-2025, 3:21 AM
‘బీఫ్ తినేవాడు రాముడిగా నటిస్తున్నాడు’.. అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చిన్మయి సెన్సేషనల్ ట్వీట్

రణ్‌బీర్ కపూర్ నటించిన ‘రామాయణం’ చిత్రంపై ఓ నెటిజన్ చేసిన విమర్శలకు గాయని చిన్మయి సోషల్ మీడియాలో బలమైన ప్రతిస్పందన ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'లో రాముడిగా నటిస్తున్నారు.

2

ఓ నెటిజన్ రణ్‌బీర్ బీఫ్ తినడంపై విమర్శలు చేశారు.

4

చిన్మయి ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ లో రాముడిగా

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రామాయణ’(Ramayana). ఇందులో స్టార్ హీరో యశ్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ బీజిఎంలు,విజువల్స్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. ఇటీవల మూవీ మేకర్స్ ‘రామాయణ’ గ్లింప్స్ విడుదల చేసి సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

నెటిజన్ విమర్శలు మరియు చిన్మయి ప్రతిస్పందన

ఈనేపథ్యంలో.. ఓ నెటిజన్ రణ్‌బీర్ రాముడి పాత్రలో కనిపించడంపై షాకింగ్ ట్వీట్ పెట్టాడు. ‘‘బీఫ్ తినేవాడు రాముడి పాత్ర పోషించడమేంటి? మన కర్మ’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కాస్త సింగర్ చిన్మయి కంట పడటంతో ఈ విషయంపై సెన్సేషనల్ ట్వీట్ పెట్టింది. ‘‘దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు. జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు. ఇదే భక్తి ఇండియా. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా.

సోషల్ మీడియాలో చర్చ

ఒక రెపిస్ట్ ఎంపీ గెలిస్తే మీకు ఏం అనిపించడం లేదా’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అలాగే ఈ మ్యాటర్‌లో దూరకండి అని ఓ నెటిజన్ అనగా.. దానికి చిన్మయి.. ‘‘దేవుడి పేరుతో అటెన్షన్ అందిపుచ్చుకునే వాళ్లు ఎలా నాశనం అవుతున్నారో చూస్తూనే ఉన్నాం’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

చిన్మయి ప్రతిస్పందన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటన భక్తి, ఆహారపు అలవాట్లు మరియు సెలబ్రిటీలపై ప్రజల దృష్టికోణాలను ప్రశ్నించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.