
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అయితే, ఆయన తదుపరి చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లోని ఒక సీన్ సోషల్ మీడియాలో లీక్ అయింది.
Key Points
చిరంజీవి, నయనతారల కొత్త సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది.
పెళ్లి సన్నివేశం షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది.
సినిమాకు మెగా 157 వర్కింగ్ టైటిల్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంచనాలను పెంచుతోంది.
కేరళలో జరుగుతున్న షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు . బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు . ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం రిలీజ్ కాలేదు . రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఈ సినిమా విడుదలను వాయిదా వేశామని అప్పట్లో ఈ చిత్రం యూనిట్ పేర్కొంది . ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కావొచ్చని టాక్ వినిపిస్తోంది .
ఈ సంగతి పక్కనపెడితే చిరంజీవి విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు . వీరిద్దరి కాంబోలో మూవీ రానుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు . ఈ చిత్రంలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుంది . తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది . ఈ మూవీకి సంబంధించిన ఓ సీన్ షూట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది . నీటిలో పడవపై మెగాస్టార్ , నయనతార కూర్చుని ఉండగా .. పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది . ఈ వీడియో నెట్టింట లీక్ కావడంతో హల్ చల్ చేస్తోంది . కేరళలోని అలప్పుజలో చిరంజీవి, నయనతారలపై పెళ్లి సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు అర్థమవుతోంది . కాగా .. ఈ సినిమాను మెగా 157 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు .
లీక్ అయిన పెళ్లి సన్నివేశం వీడియో
మెగా 157 సినిమా వివరాలు
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సినిమా షూటింగ్‌లోని లీక్ అయిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.


