
📌 Key Points
- మెగాస్టార్, నటసింహం కలిసి నటించేందుకు సన్నాహాలు! త్వరలో బోయపాటి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రం!
- బాలయ్య ఆహ్వానిస్తే చిరు నో చెప్పే ప్రసక్తే లేదు! అభిమానులకు పండగే పండగ!!
- ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి ఇద్దరు స్టార్ హీరోలు రెడీ! రికార్డులు బద్దలు కావడం ఖాయం!
- వెంకీతో చిరు సంక్రాంతి హిట్! బాలయ్యతో కలిసి మరో బ్లాక్ బస్టర్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు!
టాలీవుడ్లో ఒక సంచలనం! మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారా? ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిరు, బాలయ్య కలిసి ఎప్పుడు కనిపించినా పండగే!
Chiranjeevi Balakrishna : చిరంజీవి – బాలకృష్ణ పలు సందర్భాల్లో సినిమా ఈవెంట్స్ లో కలిసి కనిపిస్తారు కానీ బయట కలిసి కనిపించడం తక్కువే. గత కొన్నేళ్లుగా మాత్రం పలు ఈవెంట్స్ లో చిరు – బాలయ్య కలిసి కనిపించి అభిమానులకు సంతోషాన్ని ఇస్తున్నారు. అసలు ఇపుడు ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చిరు – బాలయ్య ఫ్యాన్స్ బయట రియల్ గా కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు చిరు – బాలయ్య కలిసి కనిపిస్తే పండగే. కొన్ని నెలల క్రితం బాలయ్య 50 ఏళ్ళ సినీ వేడుకకి చిరంజీవి గెస్ట్ గా వచ్చి బాలయ్యని తెగ పొగిడారు. అసలు ఇంద్ర సినిమా వచ్చిందే బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల నుంచి అన్నారు. బాలయ్య – నేను కలిసి నటిస్తాము అలాంటి పవర్ ఫుల్ సినిమా ఎవరైనా రాయండి అని కూడా అన్నారు. బోయపాటికి ఛాలెంజ్ కూడా విసిరారు ఇద్దరినీ పెట్టి సినిమా తీయమని. బాలయ్య కూడా అందుకు ఓకే చెప్పారు.
బోయపాటికి చిరు ఛాలెంజ్.. బాలయ్య గ్రీన్ సిగ్నల్!
అయితే ఇప్పుడు ఇది నిజం అవుతుందని టాలీవుడ్ లో రూమర్స్ వస్తున్నాయి. బోయపాటి ఇటీవల ఓ టీవీ ఈవెంట్ కి రాగా చిరంజీవి ఇచ్చిన ఛాలెంజ్ గుర్తుచేశారు. దాంతో అవకాశం ఉంటే చేస్తాను అన్నారు. బోయపాటి అఖండ 2 తర్వాత ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు. అటు చిరంజీవి, బాలయ్య మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చిరు ఆల్రెడీ వెంకీతో ఇటీవలే సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అని వచ్చి హిట్ కొట్టారు.
టాలీవుడ్లో హాట్ టాపిక్: చిరు, బాలయ్య మల్టీస్టారర్!
దీంతో చిరంజీవి – బాలయ్య ని పెట్టి బోయపాటి సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరో ఒకర్ని మెయిన్ హీరోగా పెట్టి ఇంకొకరిని గెస్ట్ అప్పీరెన్స్ లా పెట్టాలని అనుకుంటున్నారట. బోయపాటితో సినిమా అంటే బాలయ్య ఓకే అంటాడు కాబట్టి బాలయ్య అడిగితే చిరంజీవి ఆ సినిమాలో చేస్తాడని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. ఇదే కనక జరిగి బాలయ్య – చిరు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ కి పెద్ద పండగే. సినిమా రికార్డులు కూడా బద్దలవ్వాల్సిందే. మరి ఆ కోరిక బోయపాటి తీరుస్తాడా అంటే ఎదురు చూడాల్సిందే.
చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాం.


