|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి వర్సెస్ చిన్మయి: కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కామెంట్స్.. చిన్మయి కౌంటర్ ఎటాక్ తో టాలీవుడ్ షేక్!

Published: 28-01-2026, 12:05 AM
చిరంజీవి వర్సెస్ చిన్మయి: కాస్టింగ్ కౌచ్ పై మెగాస్టార్ కామెంట్స్.. చిన్మయి కౌంటర్ ఎటాక్ తో టాలీవుడ్ షేక్!
  • మెగాస్టార్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి, ఇండస్ట్రీలో లేదన్న చిరు కామెంట్స్.
  • చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్ ఎటాక్! కమిట్‌మెంట్ అంటే సెక్సువల్ ఫేవర్స్ అడగడమేనా? సినీ పరిశ్రమలో చీకటి కోణాలున్నాయని సంచలన వ్యాఖ్యలు.
  • చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన నెటిజన్లు.. ఇండస్ట్రీ పెద్ద సమస్యనే లేదన్నట్లు మాట్లాడటం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • సామాన్య నటీమణులకు ఎదురయ్యే కాస్టింగ్ కౌచ్ సమస్యలపై చిన్మయి చేసిన కామెంట్స్‌ వైరల్.. టాలీవుడ్‌లో మరో వివాదం!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి చేసిన కామెంట్స్ పెను దుమారానికి దారి తీశాయి. చిన్మయి ఘాటుగా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి.

చిరంజీవి కామెంట్స్ వైరల్.. కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు!

Chiranjeevi vs Chinmayi : సినిమా ఇండస్ట్రీకి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక చెరిగిపోని మచ్చ లాంటిది. అప్పుడప్పుడూ ఈ టాపిక్ తెరపైకి రావడం, రచ్చ..రచ్చ జరగడం కామన్ అయిపోయింది. లేటెస్ట్‌గా ఈ సెన్సెటీవ్‌ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్, సింగర్ చిన్మయ్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

రీసెంట్‌గా జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటిదేం లేదు. అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది..మనం ఎలా ఉంటే అది అలానే రిఫ్లెక్ట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఈ మాటలను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తప్పుబట్టింది. చిరు చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉందని, ఇండస్ట్రీలో చీకటి కోణం ఇంకా బలంగానే ఉందని తేల్చి చెప్పింది.

చిన్మయి కౌంటర్ ఎటాక్.. ఇండస్ట్రీలో చీకటి కోణాలున్నాయని షాకింగ్ కామెంట్స్!

కమిట్‌మెంట్ అంటే పని పట్ల అంకిత భావం కాదని, పరోక్షంగా సెక్సువల్ ఫేవర్స్ అడుగుతున్నారని బ్లాస్టింగ్‌ కామెంట్స్ చేసింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల దగ్గర, పవర్‌లో ఉన్న మగవాళ్లు తమకు ఈ సుఖం దక్కాల్సిందే అని రూల్స్ పెడుతున్నారని, ఇది హక్కుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి.

చిరంజీవి కామెంట్స్‌పై టాలీవుడ్‌లో పెద్ద దుమారమే లేస్తోంది. అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చిరంజీవి ఎలా చెబుతారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దగా చెప్పబడుతున్న ఆయన అసలు సమస్యే లేదన్నట్లు మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది. క్యాస్టింగ్ కౌచ్ సమస్య వచ్చేది అప్‌ కమింగ్‌ యాక్ట్రస్‌కు..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేనివాళ్లకు అన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.

నెటిజన్ల ఆగ్రహం.. చిరంజీవి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు!

చిన్మయి చెప్పేది చాలా కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత, అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక, స్వప్న, నాగార్జున మేన కోడలు సుప్రియలు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు రావని.. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సామాన్య లేడీ ఆర్టిస్ట్‌లు, ఇతర క్రాఫ్ట్స్‌లో పనిచేసే మహిళలకు ఎదరవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరోసారి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి రావటంతో ఇది ఎక్కడదాక పోతుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెరపైకి రావడంతో పరిశ్రమలో కలకలం రేగింది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.