|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

Published: 27-10-2025, 2:13 AM
Chiranjeevi : డీప్‌ ఫేక్‌ బారిన చిరు.. కేసు న‌మోదు

డీప్‌ఫేక్ టెక్నాలజీ సినీ ప్రముఖులను వేధిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ బారిన పడ్డారు. ఆయన ఫోటోలతో అశ్లీల వీడియోలు సృష్టించి వైరల్ చేయడంతో, చిరంజీవి సీపీకి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Key Points

1

డీప్‌ఫేక్ టెక్నాలజీ సెలెబ్రిటీలకు తీవ్ర ముప్పుగా మారింది.

2

మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించారు.

4

సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సెలెబ్రిటీలను వేధిస్తున్న డీప్‌ఫేక్ టెక్నాలజీ

Chiranjeevi : డీప్‌ఫేక్ టెక్నాల‌జీ సెలెబ్రీటీల పాలిట శాపంగా మారింది. ఈ స‌రికొత్త టెక్నాల‌జీని ఎక్కువ శాతం చెడు ప‌నుల‌కే ఉప‌యోగిస్తున్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప‌లువురు న‌టీన‌టుల‌కు సంబంధించిన ఫేక్ వీడియోలను త‌యారీ చేసి వాటిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే కాజోల్‌, కత్రినా, ర‌ష్మిక మంధాన వంటి వారు ఈ డీప్ ఫేక్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సీనీ న‌టుడు, మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం డీప్ ఫేక్ బారిన ప‌డ్డారు.

చిరంజీవి ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోష‌ల్ మీడియాలో దుండ‌గులు పోస్ట్ చేశారు. అవి వైర‌ల్‌గా మారాయి. ఈ విష‌యం చిరంజీవి దృష్టికి చేర‌డంతో ఆయ‌న వెంట‌నే సీపీ వీసీ స‌జ్జ‌నార్‌కు ఫిర్యాదు చేశారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొద‌లుపెట్టారు. త‌న పేరును దెబ్బ‌తీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చిరు కోరారు.

మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు – కేసు నమోదు

సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభం

డీప్‌ఫేక్ ఘటనపై చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన సెలబ్రిటీల గోప్యతకు పెరుగుతున్న ముప్పును మరోసారి వెల్లడించింది. సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.