|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి దాతృత్వం: అవార్డు డబ్బుతో అనాథలకు అండగా నిలిచిన మెగాస్టార్! రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు.

Published: 27-03-2026, 9:05 AM
చిరంజీవి దాతృత్వం: అవార్డు డబ్బుతో అనాథలకు అండగా నిలిచిన మెగాస్టార్! రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు.
  • చిరంజీవి తన అవార్డు డబ్బును వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలకు విరాళంగా ఇచ్చారు.
  • రామ్ చరణ్ పుట్టినరోజును చిరంజీవి వృద్ధాశ్రమంలో వృద్ధులతో జరిపారు.
  • చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తున్నారు.
  • పేద పిల్లల కోసం ఉచిత విద్యను అందించడానికి చిరంజీవి సిద్దమయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన ఎన్టీఆర్ పురస్కారంగా పొందిన డబ్బును వృద్ధాశ్రమానికి, అనాథ పిల్లల సంరక్షణకు విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజును వృద్ధాశ్రమంలో జరిపారు.

చిరంజీవి సేవా గుణం

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సేవా గుణానికి మారుపేరు అని చెప్పాలి. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ తన సంపాదించిన దాంట్లో కొంత భాగం ప్రజాసేవకు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి(Chiranjeevi) బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు ద్వారా ఎంతోమందికి సహాయపడ్డారు. అంతేకాకుండా ఎంతోమంది సినీ కార్మికులకు ఈయన పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ఇక త్వరలోనే పేద పిల్లల కోసం ఉచిత విద్యను అందించబోతున్నాము అంటూ కూడా చిరంజీవి ఇటీవల తెలియజేశారు. ఇలా పేదల కోసం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూ చిరు తన గొప్ప మనసును చాటుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. నేడు శ్రీరామనవమి అలాగే తన కొడుకు రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు (Birthday) కావడంతో ఈయన వృద్ధాశ్రమంలో ఘనంగా తన కొడుకు పుట్టినరోజు వేడుకలను జరిపి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు భోజనాలను ఏర్పాటు చేయించారు. అలాగే వారికి కొత్త బట్టలను కూడా అందజేశారు. ఇలా వృద్ధాశ్రమంలో చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను జరపడంతో అభిమానులు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సమయంలో కొంతమంది వృద్ధులు రాంచరణ్ కలిసి ఆయన పుట్టిన రోజును జరుపుకోవాలని ఆకాంక్షించారట. ఈ నేపథ్యంలోని చిరంజీవి ఆ వృద్ధులందరినీ బ్లడ్ బ్యాంకుకు ఆహ్వానించి వారి సమక్షంలోనే పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా ఇటీవల గద్దర్ ఫిలిం అవార్డులో భాగంగా చిరంజీవి ఎన్టీఆర్ పురస్కారాన్ని(NTR Award) సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకున్నందుకుగాను ఈయనకు పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఇక ఈ పదిలక్షలను చిరంజీవి వృద్ధాశ్రమానికి, అనాధ పిల్లల సంరక్షణ కోసం, బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారికి విరాళంగా అందజేశారు.

సేవా కార్యక్రమాల కోసం పది లక్షలు విరాళం..

విరాళంగా అవార్డు డబ్బులు

ఇలా తనకు వచ్చిన పది లక్షల రూపాయలను చిరంజీవి వివిధ సేవా కార్యక్రమాల కోసం విరాళంగా ప్రకటించడంతో చిరంజీవి మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మొదటినుంచి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈయన ఇప్పుడు కూడా మరోసారి తన సేవ గుణాన్ని చాటుకున్నారు. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఇక పెద్ది సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

చిరంజీవి తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనులకు అభిమానులు కూడా అండగా నిలవడం అభినందనీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.