
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ స్పీచ్! రామ్ చరణ్ పెద్ది సినిమా విజయంపై అద్భుత వ్యాఖ్యలు.
- రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రూ. 420 కోట్ల గ్రాస్ వసూళ్లు! భారీ బ్లాక్ బస్టర్ ఈవెంట్ తో సెలబ్రేషన్స్.
- చరణ్ కష్టాన్ని కళ్లారా చూసి కదిలిపోయిన చిరు! అవార్డుల కంటే ప్రేక్షకుల మెప్పే గొప్పదన్న మెగాస్టార్.
- బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమాకు మెగాస్టార్ ప్రశంసలు! సుకుమార్ విజన్ కు హ్యాట్సాఫ్.
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో సాధించిన అద్భుత విజయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. శిల్పకళావేదికలో జరిగిన మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. చిరు మాటలు సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
పెద్ది ఘన విజయం: 420 కోట్ల గ్రాస్ వసూళ్లు!
Chiranjeevi : రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇన్ స్పైరింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగిడారు. పెద్ది సినిమా భారీ విజయం సాధించినందుకు నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు రావాలి. పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. ఈ సినిమా చూసినప్పుడు ఒక రకమైన భావోద్వేగాన్ని పొందాను. అలా తక్కువ సినిమాలకు కలుగుతుంది. నేను సినిమాలో లీనమయ్యాను. ఇది పవర్ ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్, ఇంటెన్స్ సబ్జెక్టు. ఇలాంటి కథని చరణ్ దగ్గరకు తీసుకొచ్చినందుకు బుచ్చిబాబుకు ధన్యవాదాలు. బుచ్చిబాబు లాంటి దర్శకులను సాన పెట్టి బయటకు తీసిన సుకుమార్ ని అభినందించాలి. చరణ్ ని ఒక తోటి నటుడిగా అభినందిస్తున్నా. తండ్రిగా గర్వపడుతున్నా. రంగస్థలం సినిమాకు చరణ్ ని గొప్పగా చేసాడని అభినందించారు. అలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. తక్కువ గ్యాప్ లోనే మళ్ళీ పెద్ది వచ్చింది. ఇలాంటి పాత్ర రావడం చరణ్ అదృష్టవంతుడు. ఆర్టిస్టులు ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి కానీ ఫేస్ లో చూపించి రక్తి కట్టించాలి అనుకోకూడదు. తను ఎమోషన్ ని కళ్ళతో చూపించాడు తను ఫీల్ అయి నటించాడు.
చరణ్ కష్టంపై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్!
స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు చరణ్ కి అవసర్లేదు ఇంత కష్టం, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు కానీ చరణ్ వన్ మ్యాన్ షో అయ్యేలా కష్టపడ్డాడు. మీ అందరూ నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు. రంగస్థలంకి నేషనల్ అవార్డు వస్తుంది అని సుకుమార్ కూడా అన్నాడు. అది రానివ్వు రానివ్వకపోనివ్వు కానీ ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని ప్రజలు అన్నారు. దానికి మించిన అవార్డు లేదు. అవార్డు రావడానికి చాలా దార్లు ఉంటాయి కానీ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటుంటే అదే గొప్ప అవార్డు.
ఈ సినిమాకు చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంత కష్టపడ్డాడో. ఎక్సర్ సైజ్ చేసాడో నేను కళ్లారా చూసి అవసరమా అని అన్నాను. కానీ సినిమా గురించి చెప్పాడు. వాళ్ళ అమ్మ బాధపడింది కానీ నేను శభాష్ కష్టాన్ని నమ్ముకున్నాడు అని అభినందించాను. చరణ్ కి కంటికి దెబ్బ తగిలింది, హాస్పిటల్ కి తీసుకెళ్ళాం అని ఫోన్ కాల్ వచ్చి ఆ కన్ను ఫోటో పెట్టారు. ఆ కన్ను అంతా ఎర్రగా అయిపోవడంతో భయపడ్డాను కన్ను పోతుందేమో అని. వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదు. డాక్టర్ తో మాట్లాడాను. కన్ను గుడ్డు పోవాల్సింది జస్ట్ మిస్ లో బోన్ దగ్గర తగిలింది కుట్లు వేసాను అని చెప్తే రిలీఫ్ అయ్యాను. అంత కష్టం చూసి బాధపడే కంటే కూడా సంతోష పడ్డాను. అప్పట్లో నా కష్టం చూసి మా నాన్న కూడా నన్ను తిట్టేవాడు ఎందుకు అదంతా అని ఇప్పుడు ఒక తండ్రిగా నాకు అనిపిస్తుంది. కంటికి దెబ్బ, మణికట్టు గాయం.. ఇవ్వని చెప్తుంటే మా నాన్నే గుర్తొచ్చారు. ఇవాళ నా కొడుకు కష్టానికి ప్రతీక. అడ్డదారిలో ఏది రాదు అని కష్టపడ్డాడు, మీ అందరితో పెద్ది అనిపించుకున్నాడు.
అవార్డుల గురించి చిరు సంచలన వ్యాఖ్యలు!
మేము కష్టాన్ని నమ్ముకున్నాం. ఏది షార్ట్ కట్ లో రావాలని కోరుకోము. నేను, చరణ్ జిమ్ లో పోటీ పడతాము అప్పుడప్పుడు. చరణ్ నటించలేదు ఈ సినిమాలో జీవించాడు. ఇక చిరంజీవి కాదు చరణ్ జీవి అని మీరు అంటుంటే ఆనందంగా ఉంది. నిన్న చరణ్ ఢిల్లీలో ఒక సమ్మిట్ లో పాల్గొంటే అక్కడ చరణ్ ని న్యూ ఏజ్ మెగాస్టార్ అన్నారు. అందుకే నేను వెనక ఉండి చరణ్ ముందు ఉండాలి అని అనుకోవడం కరెక్ట్. రంగస్థలం తర్వాత కొంతవరకు పెద్ది తర్వాత మొత్తం పుత్రోత్సాహం నేను ఫీల్ అవుతున్నాను. బిడ్డ ఎదిగాడు మీరు ఇంకా సినిమాలు చేయాలా అని అడిగారు. నేను చేయాలి, చేస్తాను. పని చేయడంలో ఆనందం ఉంటుంది. ఇప్పటికి ఉదయమే లేచి షూట్ కి వెళ్తున్నాను. అందరికి పని జీవనోపాధి. సోమరితనం ఉండకూడదు అందరికి. మా కష్టానికి ప్రతిఫలంగా మమ్మల్ని ఎక్కడో మీ గుండెల్లో పెట్టారు. చరణ్ తరపున మా కుటుంబం తరపున అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. అనంతరం మూవీ యూనిట్ ని అభినందించారు చిరంజీవి.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మధ్య ఉన్న ఈ బంధం, సినిమా పట్ల వారి అంకితభావం నిజంగా అద్భుతం. ‘పెద్ది’ విజయం తెలుగు సినిమాకు గర్వకారణం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి చూడండి!


