
📌 Key Points
- జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అయిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ మూవీ.
- ఐదు రోజుల్లో రూ.226 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన చిరంజీవి సినిమా.
- ఈ సినిమాలో నయనతార, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు.
- వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించడంతో సినిమాకు మరింత క్రేజ్.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది.
5 రోజుల్లో రూ.226 కోట్లకు పైగా వసూళ్లు!
ఈ క్రమంలో ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అలా రిలీజ్ అయిన ఐదు రోజుల్లో రూ.226 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలియజేశారు. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని రాసుకొచ్చారు. కాగా ఈరోజు, రేపు వీకెండ్ కాబట్టి ఇదే ఊపులో మరింత ఎక్కువ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది.
వీకెండ్‌లో మరింత జోరు!
A post shared by Anil Ravipudi (@anilravipudi)
చిరంజీవి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి.


