|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi: ‘మా ఊర్లో కుర్రాళ్లు మీసాల పిల్ల అని పిలుస్తారు’.. మెగాస్టార్ ప్రోమో చూశారా!

Published: 03-10-2025, 12:06 AM
Chiranjeevi: 'మా ఊర్లో కుర్రాళ్లు మీసాల పిల్ల అని పిలుస్తారు'.. మెగాస్టార్ ప్రోమో చూశారా!

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడిల “మన శంకరవరప్రసాద్‌గారు” చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన “మీసాల పిల్ల” ప్రోమోలో చిరంజీవి, నయనతారను ఆటపట్టించడం ఆకట్టుకుంది. ఈ ప్రోమో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Key Points

1

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో 'మన శంకరవరప్రసాద్‌గారు' చిత్రం వస్తోంది.

2

నయనతార పాత్ర పేరు శశిరేఖ, చిరంజీవి ఆమెను 'మీసాల పిల్ల' అని ఆటపట్టించారు.

4

వచ్చే ఏడాది సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్‌గారు' థియేటర్లలో విడుదల కానుంది.

‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర విశేషాలు

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ ‍అవైటేడ్ చిత్రం  మన శంకరవరప్రసాద్‌గారు (Mana Shankara Vara Prasad Garu Movie). సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ కావడంతో అభిమానుల్లోనూ అదే రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి.

ఇటీవలే నయనతార ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేసిన మేకర్స్.. ఆమె పాత్ర పేరును శశిరేఖగా పరిచయం చేశారు.  తాజాగా దసరా సందర్భంగా ప్రోమోను విడుదల చేశారు. మీసాల పిల్ల పేరుతో ఈ ప్రోమోను రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. మా ఊర్లో కుర్రోళ్లు పొగరుమోతు పిల్లని క్యూట్‌గా… మీసాల పిల్ల అని పిలుస్తారు అంటూ ఆటపట్టించారు. ఈ హిలారియస్ కామెడీ ప్రోమో మీరు కూడా చూసేయండి. కాగా.. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్‌ గారు థియేటర్లలో సందడి చేయనున్నారు.

నయనతారను ‘మీసాల పిల్ల’ అని ఆటపట్టించిన చిరు

సినిమా విడుదల ఎప్పుడంటే?

‘మీసాల పిల్ల’ ప్రోమోతో అంచనాలను మరింత పెంచిన చిరంజీవి-అనిల్ రావిపూడిల ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.