|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి సినిమా టికెట్ ధర రూ.1.02 లక్షలు! షాకింగ్ వివరాలు ఇవే!

Published: 06-01-2026, 5:30 AM
చిరంజీవి సినిమా టికెట్ ధర రూ.1.02 లక్షలు! షాకింగ్ వివరాలు ఇవే!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర ఏకంగా రూ.1.02 లక్షలకు అమ్ముడుపోయింది.
  • ఈ ప్రత్యేక టికెట్ వేలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించారు.
  • చిరంజీవి వీరాభిమాని చాగంటి గణేశ్ ఈ అరుదైన టికెట్‌ను దక్కించుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి ఏకంగా రూ.1.02 లక్షలకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఒక మెగా అభిమాని ఈ అరుదైన టికెట్‌ను దక్కించుకోవడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

లక్ష దాటిన చిరంజీవి టికెట్: ఎక్కడ జరిగింది?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల కోసం జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. ఈ త‌రుణంలోనే చిరంజీవి న‌టించిన‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర రూ.1.02 ల‌క్ష‌లు ప‌లికింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ బెన్‌ఫిట్ షో టికెట్ వేలం నిర్వ‌హించారు.

ఈ త‌రుణంలోనే రూ.1.02 ల‌క్ష‌ల‌కు బెనిఫిట్ షో మొదటి టికెట్ దక్కించుకున్నారు చిరంజీవి అభిమాని చాగంటి గణేశ్. అనంతరం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎం ఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ కేక్ కట్ చేసి మెగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కాగా చిరంజీవి న‌టించిన ‘మన శంకర వరప్రసాద్ గారు సినిమా జ‌న‌వ‌రి 12వ తేదీన రిలీజ్ కానుంది.

మెగా అభిమాని చాగంటి గణేశ్ క్రేజ్

సినిమా విడుదల తేదీ, అంచనాలు

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష రూపాయలు దాటడం మెగా అభిమానుల క్రేజ్‌ను మరోసారి చాటింది. ఈ సంఘటన ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.