
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సినీ రంగంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ కుమార్ కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి చిరంజీవి పేర్కొన్నారు.
Key Points
శివరాజ్ కుమార్ సినీ రంగంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
చిరంజీవి శివరాజ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి, రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు.
శివరాజ్ కుమార్ యువతకు స్ఫూర్తిగా నిలవాలని చిరంజీవి కోరుకున్నారు.
శివరాజ్ కుమార్ 40 ఏళ్ల సినీ జర్నీ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న ‘పెద్ది’(peddi)మూవీలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివ్యేందు శర్మ(Divyendu Sharma) కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. శివరాజ్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ చిరు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శివరాజ్ కుమార్ తండ్రి నటుడు రాజ్ కుమార్‌తో నాకు ప్రత్యేకమైన అనుభందం ఉంది.
చిరంజీవి శుభాకాంక్షలు
ఆయన నాకు తండిలాంటివారు. అతను కేవలం ఒక సూపర్ స్టార్ మాత్రమే కాదు.. ఒక డెమి గాడ్. నాకు రాజ్ కుమార్‌తో ఉన్న రిలేషన్ వల్ల వారి ఫ్యామిలీ నాకు కూడా కుటుంబంలాగా మారింది. అతని కొడుకులు శివరాజ్ కుమార్, అప్పు, రాఘవేంద్ర నా ఫ్యామిలీ అనుకుంటాను. అయితే రాజ్ కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే సూపర్‌స్టార్‌గా ఎదిగిన శివరాజ్ కుమార్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ అద్భుతమైన విజయాన్ని సాధించారు. నా కళ్ళ ముందే సూపర్‌స్టార్‌గా ఎలా ఎదిగాడో చూడటం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
రాజ్ కుమార్ కుటుంబంతో అనుబంధం
ఆయన సినిమాల్లోకి వచ్చి అప్పుడే 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఈ మైలురాయిని చేరుకున్నందుకు నిన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నువ్వు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని.. అభిమానులతో పాటు యువతకి మీ సినిమాలు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. శివన్నా నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఎన్ని సినిమాలు చేయాలి. మన మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి శివరాజ్ కుమార్‌కు అభినందనలు తెలిపి, ఆయన భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని ఆశించారు. యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకున్నారు.


