|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ పాటపై చిరు రియాక్షన్: వెండితెర షేక్ అవుతుందన్న మెగాస్టార్!

Published: 03-03-2026, 7:05 AM
రామ్ చరణ్ పాటపై చిరు రియాక్షన్: వెండితెర షేక్ అవుతుందన్న మెగాస్టార్!
  • చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రారా’ పాటను మెచ్చుకున్నారు.
  • బుచ్చిబాబు సాన దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
  • రామ్ చరణ్ తన గ్రేస్ మరియు ఎనర్జీతో డాన్స్ లో మ్యాజిక్ చేశాడని చిరంజీవి కొనియాడారు.
  • ఈ పాట వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తుందని చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రారా’ పాటను ప్రశంసించారు. ఈ పాట అద్భుతంగా ఉందని, వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈయన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి సినిమాలపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. చిరంజీవి సినిమాల విషయం పక్కన పెడితే ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారు. ఏ హీరో సినిమా విడుదల అయిన సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్(Ramcharan) సినిమాలోని పాటపై ప్రశంసలు కురిపిస్తూ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది(Peddi). ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘రైరైరారా’ (Rai Rai Raa Raa)అంటూ సాగిపోయే పాటను విడుదల చేయడంతో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ పాటపై ఇప్పటికే ఎంతోమంది అభిమానులు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు.

ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రై రై రారా పాట గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా చిరంజీవి పోస్ట్ చేస్తూ బుచ్చిబాబు సనా మేకింగ్ ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ తోడయ్యి ఈ పాటను మంచి విజువల్ ఫీస్ట్ గా మార్చాయని తెలిపారు. చరణ్ తనదైన గ్రేస్ ఎనర్జీతో డాన్స్ లో మ్యాజిక్ చేశాడని, అనంత శ్రీరామ్ సాహిత్యం, రత్న వేల్ విజువల్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తుందంటూ ఈ సందర్భంగా చిరంజీవి రైరైరారా పాట గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

‘రై రై రారా’ పాట విశేషాలు

#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.

Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!

Kudos to… pic.twitter.com/98Wc25JCpT

సోషల్ మీడియాలో వైరల్

— Chiranjeevi Konidela (@KChiruTweets) March 3, 2026

ఇలా మెగాస్టార్ చిరంజీవి ఈ పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాంచరణ్ సినీ కెరియర్ లో పెద్ది సినిమా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఇక చరణ్ చివరిగా రాజమౌళి డైరెక్షన్లో నటించిన RRR సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులు కూడా పెద్ది సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమాలోని పాటను ప్రశంసించడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ పాట సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.